
షాపింగ్ మాల్ సినిమా గుర్తుందా..? అంజలి సినిమాగా నటించిన ఈ సినిమా ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. అందమైన ప్రేమకథగా తెరకెక్కిన ఈ సినిమా తమిళ్‌లో తెరకెక్కింది. అలాగే తెలుగులోనూ డబ్ అయ్యింది ఈ సినిమా. 2010లో విడుదలైన ఈ సినిమాలో పాటలు పాపులర్ అయ్యాయి. ఇక ఈ సినిమాలో అంజలి తన నటనతో ఆకట్టుకుంది. ఈ సినిమా తర్వాత హీరోయిన్ గా ఫుల్ బిజీ మారిపోయింది అంజలి. ఇటీవలే ఈ హీరోయిన్ తన 50వ సినిమా గీతాంజలి మళ్లీ వచ్చింది సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా మంచి టాక్ ను సొంతం చేసుకుంది. నిజానికి అంజలి తెలుగు అమ్మాయి అయినప్పటికీ తమిళ్ సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది. ఆతర్వాత తెలుగు తమిళ్ భాషల్లో వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది అంజలి.
అంగడి తేరు అనే పేరుతో తమిళ్ లో తెరకెక్కిన ఈ సినిమా షాపింగ్ మాల్ గా తెలుగులోకి డబ్ అయ్యింది. కాగా షాపింగ్ మాల్ సినిమాలో నటించిన హీరో గుర్తున్నాడా.. ? ఆయన ఇప్పుడు ఎలా ఉన్నాడు.? ఏం చేస్తున్నాడో తెలుసా.? షాపింగ్ మాల్ సినిమాలో అమాయకుడిగా కనిపించి మెప్పించాడు అతను. అతని పేరు మహేష్. షాపింగ్ మాల్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు మహేష్. షాపింగ్ మాల్ సినిమా తర్వాత మహేష్ తమిళ్ లోనే కొన్ని సినిమాలు చేశాడు. దాదాపు అక్కడ 14 సినిమాల్లో నటించాడు ఈ హీరో. కానీ అవి సక్సెస్ కాలేదు. దాంతో ప్రేక్షకులకు మహేష్ మెల్లగా దూరం అయ్యాడు.
చేసిన సినిమాలు సక్సెస్ కాకపోవడమతొ పాటు కొత్త సినిమాలు రాకపోవడంతో డిప్రషన్ లోకి వెళ్ళాడు మహేష్. దాన్ని నుంచి బయట పడటానికి మద్యానికి బానిసయ్యాడు. విపరీతంగా మద్యం సేవించడంతో ఆర్ధికంగా చితికిపోయాడు. దాంతో అతను లుక్ పూర్తిగా మారిపోయింది. గుర్తుపట్టలేనంతగా మారిపోయాడు. మహేష్ లో మరో టాలెంట్ ఉంది. ఆయన జాతీయ స్థాయిలో వాలిబాల్ క్రీడాకారుడు కూడా. కానీ సినిమాల వల్ల వాలిబాల్ ను పక్కన పెట్టేశాడు. కానీ సినిమాల్లో సక్సెస్ కాలేకపోయాడు. అటు వాలిబాల్ ను కూడా వదిలేయడంతో అతను ఆర్థికంగా చితికిపోయాడు. అదే వాలిబాల్ ను కంటిన్యూ చేసి స్పోర్ట్స్ కోటాలో తనకు మంచి ప్రభుత్వ ఉద్యోగం వచ్చి ఉండేదని.. పెద్ద ఆఫీసర్ అయ్యేవాడిని అని గతంలో మహేష్ ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు.ఇప్పుడు ఆయన ఫోటోలు సోషల్ మీడియాలోనూ ఎక్కడ కనిపించడం లేదు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.