AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Raviteja: రవితేజతో ఆ సూపర్ హిట్ మూవీ మిస్సైన హీరోయిన్ ఆసిన్.. చివరకు ఆ బ్యూటీకి లక్కీ ఛాన్స్..

మాస్ మాహారాజా రవితేజకు ఉన్న ఫ్యాన్ పాలోయింగ్ గురించి చెప్పక్కర్లేదు. ఆయన యాక్టింగ్, మేనరిజం, స్టైల్, డైలాగ్ డెలివరీకి యువతలో మంచి క్రేజ్ ఉంది. ఇక రవితేజ నటించిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్స్ అయ్యాయి. మరికొన్న సినిమాలు కమర్షియల్ హిట్ కాలేకపోయినా.. అడియన్స్ నుంచి పాజిటివ్ రివ్యూస్ అందుకున్నాయి. రవితేజ చిత్రాలు ఏళ్లు గడిచినా ఫ్రెష్ గానే ఉంటాయి.

Raviteja: రవితేజతో ఆ సూపర్ హిట్ మూవీ మిస్సైన హీరోయిన్ ఆసిన్.. చివరకు ఆ బ్యూటీకి లక్కీ ఛాన్స్..
Raviteja, Asin
Rajitha Chanti
|

Updated on: Jul 20, 2024 | 4:16 PM

Share

మాస్ మాహారాజా రవితేజకు ఉన్న ఫ్యాన్ పాలోయింగ్ గురించి చెప్పక్కర్లేదు. ఆయన యాక్టింగ్, మేనరిజం, స్టైల్, డైలాగ్ డెలివరీకి యువతలో మంచి క్రేజ్ ఉంది. ఇక రవితేజ నటించిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్స్ అయ్యాయి. మరికొన్న సినిమాలు కమర్షియల్ హిట్ కాలేకపోయినా.. అడియన్స్ నుంచి పాజిటివ్ రివ్యూస్ అందుకున్నాయి. రవితేజ చిత్రాలు ఏళ్లు గడిచినా ఫ్రెష్ గానే ఉంటాయి. ఇక కొన్ని సినిమాల్లోని సన్నివేశాలు తలచుకోగానే ప్రేక్షకుల ముఖాల్లో నవ్వులు తెప్పిస్తాయి. అందులో వెంకీ సినిమా ఒకటి. ఇందులోని ట్రైన్ సీక్వెన్స్ కామెడీ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సోషల్ మీడియాలో ఆ ఎపిసోడ్ కు సంబంధించిన మీమ్స్ హంగామా అంతా ఇంతా కాదు.. ఆ సినిమా విడుదలై 20 సంవత్సరాలు పూర్తైంది. ఈ సందర్భంగా గతంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న డైరెక్టర్ శ్రీను వైట్ల ఓ ఇంటర్వ్యూలో పాల్గొని ఆసక్తికర విషయాలు తెలియజేశాడు.

నాగార్జున సాగర్‎కు వెళ్లి అక్కడే స్క్రిప్ట్ పూర్తి చేసే అలవాటు తనకు వెంకీ సినిమాతోనే మొదలైందని అన్నారు డైరెక్టర్ శ్రీనువైట్ల. అలాగే ఈ సినిమా కోసం ముందుగా హీరోయిన్ గా ఆసిన్ ను అనుకున్నామని.. కానీ కుదరలేదన్నారు. ట్రైన్ సీన్స్ లో ప్రముఖ కమెడియన్ ఎంఎస్ నారాయణను తీసుకుందామని ప్రయత్నించినా అది సాధ్యపడలేదన్నారు. ఈ సినిమాకు ముందుగా ట్రైన్ సీక్వెన్స్ వర్కౌట్ కాదేమోనని అందరూ సందేహించారని.. కానీ చివరకు ఆ సన్నివేశాలకే ఎక్కువ రెస్పాన్స్ వచ్చిందని అన్నారు. వెంకీ సినిమా బాగుందని చిరంజీవి సర్ చెప్పడమే ఈ సినిమా విషయంలో తనకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ అని.. వెంకీ 2 తెరకెక్కించే ఆలోచన కూడా వచ్చిందని గతంలో చెప్పుకొచ్చారు.

డైరెక్టర్ శ్రీను వైట్ల, రవితేజ కాంబోలో వచ్చిన వెంకీ సినిమాలో హీరోయిన్ గా స్నేహా నటించింది. ఇందులో శ్రీనివాస్ రెడ్డి, శ్రీను, రామచంద్ర, బ్రహ్మానందం, ఏవీఎస్ కీలకపాత్రలు పోషించగా.. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ఒక్క వేరియేషన్ రిపీట్ కాకుండా అశ్విన్ ఎన్ని ఓవర్లు వేయగలడో తెలుసా
ఒక్క వేరియేషన్ రిపీట్ కాకుండా అశ్విన్ ఎన్ని ఓవర్లు వేయగలడో తెలుసా
నిద్ర లేవగానే ఫోన్ చూస్తున్నారా? అసలు నిజం తెలిస్తే షాక్!
నిద్ర లేవగానే ఫోన్ చూస్తున్నారా? అసలు నిజం తెలిస్తే షాక్!
నిజమైన ఆనందం ఎక్కడ ఉంది..? రమణ మహర్షి చెప్పిన అద్భుత సత్యం!
నిజమైన ఆనందం ఎక్కడ ఉంది..? రమణ మహర్షి చెప్పిన అద్భుత సత్యం!
శ్రీమహావిష్ణువు యోగనిద్రలోకి వెళ్లే పవిత్ర దినం.. తొలి ఏకాదశి..
శ్రీమహావిష్ణువు యోగనిద్రలోకి వెళ్లే పవిత్ర దినం.. తొలి ఏకాదశి..
డీమార్ట్ ఓనర్ ఎంత వరకు చదువుకున్నారో తెలుసా?
డీమార్ట్ ఓనర్ ఎంత వరకు చదువుకున్నారో తెలుసా?
తులసి vs మనీ ప్లాంట్.. మీ తలరాత మారాలంటే ఇంటి గుమ్మం ముందు..
తులసి vs మనీ ప్లాంట్.. మీ తలరాత మారాలంటే ఇంటి గుమ్మం ముందు..
ఒంట్లో వండ‌ర్స్ సృష్టించాలంటే ఈ కాయల వల్లే సాధ్యం..
ఒంట్లో వండ‌ర్స్ సృష్టించాలంటే ఈ కాయల వల్లే సాధ్యం..
పిల్లలు ఫోన్ చూడకుండా అన్నం తినడం లేదా? ఆ అలవాటును మాన్పించాలంటే
పిల్లలు ఫోన్ చూడకుండా అన్నం తినడం లేదా? ఆ అలవాటును మాన్పించాలంటే
జగన్నాథుడు లక్ష్మీదేవికి రసగుల్లా తినిపించే వేడుక.. ఈరోజు యాత్ర..
జగన్నాథుడు లక్ష్మీదేవికి రసగుల్లా తినిపించే వేడుక.. ఈరోజు యాత్ర..
కాక్రోచ్ జనతా పార్టీతో ముగిసిన కేంద్రం చర్చలు..
కాక్రోచ్ జనతా పార్టీతో ముగిసిన కేంద్రం చర్చలు..