Tollywood: టీమిండియా క్రికెటర్‏తో రెండేళ్లు డేటింగ్.. కట్ చేస్తే.. విజయ్ దేవరకొండతో అట్టర్ ప్లాప్ మూవీ.. ఈ హీరోయిన్ ఎవరంటే..

సాధారణంగా ఫిల్మ్ వర్గాల్లో హీరోహీరోయిన్స్ పర్సనల్ విషయాల గురించి ఏదోక రూమర్ వినిపిస్తూనే ఉంటుంది. కొందరు ఆ వార్తలపై రియాక్ట్ అవుతే.. మరికొందరు మాత్రం సైలెంట్ గా ఉండిపోతారు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న హీరోయిన్ సైతం కొన్నాళ్ల క్రితం టీమిండియా క్రికెటర్‏తో రెండేళ్లు డేటింగ్ చేసిందని ప్రచారం నడిచింది. ఆమె ఎవరంటే..

Tollywood: టీమిండియా క్రికెటర్‏తో రెండేళ్లు డేటింగ్.. కట్ చేస్తే.. విజయ్ దేవరకొండతో అట్టర్ ప్లాప్ మూవీ.. ఈ హీరోయిన్ ఎవరంటే..
Izabelle Leite

Updated on: Jun 25, 2025 | 8:17 AM

సినీ గ్లామర్ ప్రపంచంలో నటీనటుల గురించి నిత్యం ఏదోక రూమర్ ప్రచారం జరుగుతూనే ఉంటుంది. ఇటీవల సోషల్ మీడియాలో ప్రపంచంలో స్టార్స్ పర్సనల్ లైఫ్ విషయాలు ఎక్కువగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే టీమిండియా క్రికెటర్ తో దాదాపు రెండేళ్లు డేటింగ్ చేసిన ఓ హీరోయిన్ గురించి మీకు తెలుసా.. ? కొన్నాళ్ల క్రితం ఆమె పేరు నెట్టింట మారుమోగింది. సినీరంగంలో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకోవాలని ఎన్నో కలలతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. కానీ ఆమె నటించిన చిత్రాలన్నీ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్స్ కావడంతో ఈ బ్యూటీకి సరైన క్రేజ్ రాలేదు. తెలుగులోనూ ఈ బ్యూటీ పలు చిత్రాల్లో నటించినప్పటికీ అంతగా గుర్తింపు రాలేదు. రౌడీ హీరో విజయ్ దేవరకొండ సరసన సైతం కనిపించింది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. ? ఆమె పేరు ఇసాబెల్ లైట్. ఈ పేరు చెబితే అసలే గుర్తుపట్టలేరు.

బ్రెజిల్‏కు చెందిన ప్రసిద్ధ మోడల్.. అలాగే క్రేజీ హీరోయిన్. ఒకప్పుడు క్రికెటర్ విరాట్ కోహ్లీతో ఆమె ప్రేమలో ఉందని.. వీరిద్దరు దాదాపు రెండేళ్లు డేటింగ్ చేసినట్లు కొన్నాళ్ల క్రితం ప్రచారం నడిచింది. అనుష్క శర్మను వివాహం చేసుకోక ముందు విరాట్ ఆమెతో ప్రేమలో పడ్డాడని టాక్ వినిపించింది. గతంలో వీరిద్దరు కలిసి విదేశాలకు వెళ్లిన ఫోటోస్ తెగ వైరలయ్యాయి. గతంలో తమ రిలేషన్ షిప్ పై ఇసాబెల్లె స్పందించిందని.. కానీ తమ బంధం గురించి వెల్లడించడానికి ఇష్టపడలేదని సమాచారం. ఇసాబెల్లె తెలుగు, హిందీ భాషలలో అగ్ర హీరోలతో కలిసి నటించింది.

ఇవి కూడా చదవండి

విజయ్ దేవరకొండ నటించిన వరల్డ్ ఫేమస్ లవర్ చిత్రంలో కనిపించింది ఈ బ్యూటీ. అలాగే హిందీలో అమిర్ ఖాన్ తలాష్ చిత్రంలో కనిపించింది. చాలా కాలం తర్వాత ఇసాబెల్లె ఫోటోస్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ఈ అమ్మడు నటించిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ప్లాప్ కావడంతో అవకాశాలు సైతం అంతగా రాలేదు. దీంతో కొన్నాళ్లుగా సినిమాలకు దూరంగా ఉండిపోయింది.

ఇవి కూడా చదవండి : 

Telugu Cinema: టాలీవుడ్ ఇండస్ట్రీలో తోపు హీరోయిన్.. ఇప్పుడేం స్పెషల్ సాంగ్స్‏తో రచ్చ చేస్తుంది.. ఈ క్యూటీ ఎవరంటే..

చేసిన సినిమాలన్నీ అట్టర్ ప్లాప్.. అయినా ఒక్కో సినిమాకు రూ.11 కోట్లు.. తెలుగువారికి ఇష్టమైన హీరోయిన్..

Nuvvostanante Nenoddantana: ఫ్యాషన్ ప్రపంచంలో స్టార్ హీరోయిన్.. మహిళలకు రోల్ మోడల్‏.. ఇప్పుడేం చేస్తుందంటే..

Tollywood: సినిమాలు వదిలేసి సన్యాసిగా మారిన హీరోయిన్.. కారణం ఇదేనట..