
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ నటి త్రోబ్యాక్ ఫోటో అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. పైన ఫోటోను చూశారు కదా.. అందులో కనిపిస్తున్న ఆమె టాలీవుడ్ చిత్రపరిశ్రమలో చెరగని అధ్యాయం. కొన్ని దశాబ్దాలపాటు తెలుగు సినిమా ప్రపంచంలో చక్రం తిప్పింది. దాదాపు 1000కి పైగా సినిమాల్లో నటించి మెప్పించింది. తెలుగులో మూడు తరాల నటులతో నటించి మెప్పించారు. ఇండస్ట్రీలో కథానాయికగా సినీప్రయాణం స్టార్ట్ చేసి.. ఆ తర్వాత తల్లిగా, బామ్మగా, అత్తగా, నాన్నమ్మగా ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించి ప్రతి ఇంటిలో ఒక సభ్యుడిగా నిలిచిపోయింది. తన అద్భుతమైన నటనతో కోట్లాది మంది అడియన్స్ హృదయాల్లో తనకంటూ ఓ చోటు సంపాదించుకుంది. ఇంతకీ ఆమె ఎవరో గుర్తు పట్టారా.. ? ఆమె ఎవరో కాదు.. నిర్మలమ్మ. 16వ ఏటనే 1943లో గరుడ గర్వభంగం అనే సినిమాతో నటిగా తెరంగేట్రం చేశారు.
ఇవి కూడా చదవండి : Raasi: ఆ సినిమా వల్లే కెరీర్ నాశనమైంది.. మొదటి రోజే అలాంటి సీన్ చేయించారు.. హీరోయిన్ రాశి..
ఈ సినిమా తర్వాత పాదుకా పట్టాభిషేకం సినిమాలో నటించారు. కానీ ఈ మూవీలో ఆమె ఎక్కడ కనిపించలేదట. దాదాపు ఆరేళ్ల తర్తవాత 1950లో కథానాయికగా రీఎంట్రీ ఇచ్చారు. థియేటర్లలో నాటకాలు వేసే నిర్మలమ్మ…ఇంట్లో వాళ్లకు ఇష్టంలేకపోయినా సినిమాల్లోకి అడుగుపరెట్టారు. ఎన్నో కష్టాలను దాటుకుని ఇండస్ట్రీలో నటిగా ప్రశంసలు అందుకున్నారు. అప్పట్లో గొప్ప నటులు అయిన ఎస్వీ రంగారావు, చిత్తూరు నాగయ్యలతో కలిసి నటించడం తనకు గొప్ప అనుభూతి అనే పలు సందర్భాల్లో ఆమె పంచుకున్నారు. స్వాతిముత్యం సినిమాలో కమల్ హాసన్ తల్లిగా కనిపించారు. అలాగే చిరంజీవితో కలిసి ఎన్నో సినిమాల్లో నటించారు. అలాగే దర్శకుడు, నిర్మాత ఎల్వీ ప్రసాద్ తో నటించడం తన జీవితంలో మరపురాని అనుభూతి అని పలు ఇంటర్వ్యూలలో వెల్లడించారు.
ఇవి కూడా చదవండి : Megastar Chiranjeevi : అందుకే చిరంజీవితో సినిమా చేయలేదు.. అసలు విషయం చెప్పిన హీరోయిన్..
నిర్మలమ్మ ఎక్కువగా దర్శక దిగ్గజం దాసరి నారాయణరావుతో చేశారు. తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ వంటి భాషలలో వందలాది చిత్రాల్లో నటించారు. చివరి శ్వాస వరకు సినిమాల్లో నటిస్తూనే ఉన్నారు. కెరీర్ మంచి ఫాంలో ఉన్నప్పుడే ప్రొడక్షన్ మేనేజర్ ను వివాహం చేసుకున్నారు. కానీ ఈ దంపతులకు పిల్లలు జన్మించలేదు. దీంతో కవిత అనే అమ్మాయిని దత్తత తీసుకుని పెంచి పెద్ద చేసి పెళ్లి చేశారు. ఆమెకు కొడుకు జన్మించగా.. అతడి పేరు విజయ్ మాదాల. అప్పట్లో సంధ్యరాగం అనే సినిమాలో కనిపించిన విజయ్.. తర్వాత అమెరికాలో సెటిల్ అయ్యాడు. సినీరంగంలో దాదాపు 64 సంవత్సరాలు యాక్టివ్ గా ఉన్నారు నిర్మలమ్మ. 2009 ఫిబ్రవరి 19న ఆమె తుదిశ్వాస విడిచారు.
ఇవి కూడా చదవండి : Raasi: ఆ సినిమా వల్లే కెరీర్ నాశనమైంది.. మొదటి రోజే అలాంటి సీన్ చేయించారు.. హీరోయిన్ రాశి..
Nirmalamma Movies
ఇవి కూడా చదవండి : Upendra : ఉపేంద్రతో ప్రేమాయణం.. ఇన్నాళ్లకు ఓపెన్ అయిన హీరోయిన్.. ఏమన్నారంటే..