Trivikram : సినిమా అంటే అది.. ఎన్నిసార్లు చూశానో నాకే తెలియదు.. డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్..

తెలుగు చిత్ర పరిశ్రమలో ఆయన సినిమాలకు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎప్పుడెప్పుడు ఒక అద్భుతమైన చిత్రాన్ని రూపొందిస్తారా అని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఆయనే డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్. తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో ఆయన మాటల మాంత్రికుడు. అలాంటింది ఆయన మనసుకు నచ్చిన సినిమా ఏంటో మీకు తెలుసా.. ?

Trivikram : సినిమా అంటే అది.. ఎన్నిసార్లు చూశానో నాకే తెలియదు.. డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్..
Trivikram Srinivas

Updated on: May 17, 2026 | 4:18 PM

టాలీవుడ్ ఇండస్ట్రీలో సక్సెస్ ఫుల్ డైరెక్టర్లలో త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒకరు. ఎన్నో సూపర్ హిట్ చిత్రాలతో తనదైన ముద్ర వేశారు. చివరగా గుంటూరు కారం సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ప్రస్తుతం వెంకటేష్ ప్రధాన పాత్రలో ఆదర్శ కుటుంబం అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు. అయితే ఇప్పటివరకు ఎన్నో అద్భుతమైన చిత్రాలను తెరకెక్కించిన త్రివిక్రమ్ మనసు దొచిన మూవీ గురించి మీకు తెలుసా..? అయితే ఇప్పుడు తెలుసుకుందాం. తెలుగు సినిమా చరిత్రలో కొన్ని చిత్రాలు కేవలం వినోదాన్ని మాత్రమే కాకుండా, ప్రేక్షకుడి మనసుపై చెరగని ముద్ర వేస్తాయి. అలాంటి ఆణిముత్యాల్లో ఒకటైన ‘సాగరసంగమం’ సినిమా గురించి ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒక ఇంటర్వ్యూలో పంచుకున్న ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ చిత్రంపై తనకున్న అపారమైన ఇష్టాన్ని, సినిమా వెనుక ఉన్న వైవిధ్యాన్ని ఆయన ఎంతో అందంగా వివరించారు.

ఎక్కువ మంది చదివినవి : Vijay Deverakonda : విజయ్ దేవరకొండ గుండెలపై కాలు పెట్టిన హీరోయిన్.. రౌడీ జనార్దన్ నుంచి పోస్టర్ రిలీజ్..

“సాధారణంగా ఏ సినిమా అయినా ఒక వ్యక్తి విజయ గాథను (Success Story) చూపిస్తుంది. కథానాయకుడు జీవితంలో ఎలా పైకి వచ్చాడు, ఏం సాధించాడు అనే విషయాలను తెలుసుకోవడానికి ప్రేక్షకులు ఎంతో ఆసక్తి చూపిస్తారు. కానీ, ఒక అపజయాల మూటను, ఒక ఫెయిల్యూర్ స్టోరీని (Failure Story) అంత సక్సెస్‌ఫుల్‌గా తెరపై ఆవిష్కరించడం అనేది చాలా అరుదైన విషయం. ఆ అరుదైన ఫీట్‌ను సాధించిన ఏకైక చిత్రం ‘సాగరసంగమం’మాత్రమే. ఈ సినిమాలో కమల్ హాసన్ పోషించిన ‘బాలు’ పాత్ర జీవితాంతం ఒక ఫెయిల్యూర్‌గానే మిగిలిపోతుంది. ఆ పాత్ర తను జీవితంలో ఏది కోరుకున్నా దక్కించుకోలేకపోతుంది. సినిమా చివరి వరకు దాచిపెట్టి వాడు ఫెయిల్ అయ్యాడని చెప్పడం కాకుండా, సినిమా ప్రారంభంలోనే వాడు ఒక ఫెయిల్యూర్ అనే పాయింట్ తోనే కథ మొదలవుతుంది. ఒక వ్యక్తి ఎలా ఓడిపోయాడు అనే విషాదకరమైన కథను, ప్రేక్షకులు రెండున్నర గంటల పాటు కదలకుండా కూర్చొని చూడటం అనేది ఆ సినిమా సాధించిన గొప్ప విజయం” అంటూ చెప్పుకొచ్చారు.

ఎక్కువ మంది చదివినవి : Sai Pallavi : ఆ హీరో నా ఫస్ట్ క్రష్.. అతడంటే చెప్పలేనంత ఇష్టం.. మనసులోని మాట చెప్పిన సాయి పల్లవి..

ఈ సినిమా థియేటర్లలో ఎప్పుడు విడుదలైనా, లేదా టీవీలో ఎప్పుడు టెలికాస్ట్ చేసినా ప్రేక్షకులు మళ్లీ మళ్లీ చూస్తూనే ఉంటారని, తాను కూడా ఈ సినిమాను ఎన్నిసార్లు చూశానో లెక్కే లేదని త్రివిక్రమ్ చెప్పుకొచ్చారు. కె. విశ్వనాథ్ దర్శకత్వ ప్రతిభ, కమల్ హాసన్ నటన, ఇళయరాజా సంగీతం ఈ చిత్రాన్ని తెలుగు సినీ జగత్తులో ఒక క్లాసిక్‌గా నిలబెట్టాయి అని అన్నారు.

ఎక్కువ మంది చదివినవి : Actor : ఏంటీ సర్.. ఇలా మారిపోయారు.. ఫస్ట్ సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్.. కట్ చేస్తే.. ఆటో డ్రైవర్‏గా పనిచేస్తున్న పాపులర్ నటుడు..

 

ఎక్కువ మంది చదివినవి : యూట్యూబ్ నుంచి 30 లక్షల సంపాదన.. అసలు విషయం చెప్పిన సీరియల్ నటి..

Follow Us