టాలెంటెడ్ హీరో శర్వానంద్ (Sharwanand), రష్మిక మందన్న(Rashmika Mandanna) జంటగా నటించిన లేటేస్ట్ చిత్రం ఆడవాళ్లు మీకు జోహార్లు (Aadavallu Meeku Joharlu). ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందించిన ఈ సినిమాకు డైరెక్టర్ తిరుమల కిషోర్ దర్శకత్వం వహించారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మించారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, ట్రైలర్ సినిమాపై ఆసక్తిని క్రియేట్ చేశాయి. ఈ మూవీ మార్చి 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో గురువారం హైదరాబాద్లోని స్టా్ర్ హోటల్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ సందర్భంగా.. ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమమా మహిళలు క్లాప్స్ కొట్టేలా ఉంటుందని తెలిపారు..
దర్శకుడు కిశోర్ తిరుమల మాట్లాడుతూ.. పాండమిక్ ముందు యాక్షన్, మాస్, యూత్ లవ్ స్టోరీ, ఫ్యామిలీ కథలూ వచ్చాయి. అన్నీ సక్సెస్ అయ్యాయి.పాండమిక్ తర్వాత పిల్లలతో చూసే సినిమాను మిస్ అయ్యాం. ఆ వాతావరణాన్ని మా సినిమా వంద శాతం ఇస్తుందని నమ్ముతున్నా. థియేటర్లు ఫ్యామిలీలతో కళకళలాడాలని కోరుకుంటున్నాను. ఈమధ్యనే పెద్దమ్మ గుడిలో కుంకుమార్చనకు వెళితే అక్కడ ఇతర కుటుంబాల మహిళలు తమ సభ్యుల పేర్లు చెబుతుంటే అవన్నీ మా సినిమాలోని పేర్లుగా అనిపించాయి. కనుక ఈ సినిమాకు అందరూ కనెక్ట్ అవుతారు. ఈ సినిమాలో లవ్ స్టోరీ కూడా వుంది. ఇంతకు ముందు నేను చేసిన ఉన్నది ఒక్కటే జిందగి. సినిమాను చూసి యూత్ చాలామంది తమను తాము చూసుకున్నామని చెప్పారు. నేను శైలజ ఫాదర్, డాటర్ రిలేషన్స్ పై తీశాను. అందులో చెప్పినట్లుగా నా స్నేహితుడు కనెక్ట్ అయి పెద్దగా మాటలు లేని అతను తప్పు తెలుసుకుని నన్ను పలుకరించాడు. ఇందులో అన్నీ సీన్స్ ఎంజాయ్ చేస్తారు. ఇంటర్వెల్ సీన్కు మహిళలు చప్పట్లు కొడతారని గట్టిగా చెప్పగలను అని తెలిపారు.
Also Read: Samantha: సమంతకు దూకుడెక్కువ.. షాకింగ్ విషయాలను చెప్పిన ట్రైనర్ జునైద్..
Srivalli Song: శ్రీవల్లీ సాంగ్ బెంగాలీ వెర్షన్ విన్నారా ?.. అదిరిపోయిందిగా..
Ajith: వలిమై తర్వాత స్టైల్ మార్చిన అజిత్.. న్యూలుక్ అదుర్స్ అంటోన్న ఫ్యాన్స్..
Bhagya shree : ప్రభాస్ వాటిని బాగా మెయింటేన్ చేస్తాడు.. ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చిన బాలీవుడ్ నటి