
Akashavaani Movie Teaser: దర్శకదీరుడు రాజమౌళి వద్ధ సహాయకుడిగా పనిచేసిన అశ్విన్ గంగరాజు దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘ఆకాశవాణి’. ఈ చిత్రంతో ఎం.ఎం కీరవాణి తనయుడు కాలభైరవ సంగీత దర్శకుడిగా పరిచయం కాబోతున్న సంగతి తెలిసిందే. శుక్రవారం దర్శకధీరుడు రాజమౌళి ఈ సినిమా టీజర్‌ను సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు. ఇక టీజర్ వీడియోలో.. ప్రారంభం నుంచి డైలాగ్స్ లేకుండా.. కేవలం బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్‌తోనే ఆకట్టుకుంటుంది. అడవి బిడ్డల జీవనం.. వారి వ్యథలను కళ్ళకు కట్టినట్లుగా చూపించబోతున్నట్లుగా టీజర్లోనే హింట్ ఇచ్చేశాడు దర్శకుడు.
రాత్రిళ్లు కరెంట్ లేకుండా.. కాగడాలు పట్టుకుని జీవించడం వారి పరిస్థితి. ఈ సినిమాలో కీలక పాత్రలో నటించిన సముద్రఖని.. “అంత బాగున్న ఇక్కడేదో తప్పు జరుగుతుంది శీను” అన్న డైలాగ్ ఒక్కటే ఉంది. ఇక మర్రిచెట్టు ఊడలను పట్టుకుని ఊయలూగుతున్న బాలుడు.. ఎదురుగా ఉన్న మరో ఊడకు రేడియో తగిలించడం చూస్తుంటే తెలియని అనుభూతిని కలిగిస్తోంది. తాజాగా విడుదలైన టీజర్‌తో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. అటు దర్శకదీరుడు రాజమౌళి తన శిష్యుడిపై ప్రశంసలు కురింపించాడు. ఇక ట్రైలర్‌తో కనిపించిన విజువల్స్, మ్యూజిక్ ప్రేక్షకులకు సరికొత్త భావాన్ని కలిగిస్తున్నాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ వింటుంటే.. ఇక సినిమాలో మ్యూజిక్ ఎలా ఉంటుందో అనే ఆసక్తిని కలిగించాడు అశ్విన్. “ఆ విజువల్స్ , మ్యూజిక్ ఎంతో కొత్తగా ఉన్నాయి. ఈ సినిమాతో అశ్విన్ ఎలాంటి మ్యాజిక్ చేస్తాడా అని ఆతృతగా ఎదురు చూస్తున్నా” అని తన ట్విట్టర్ ఖాతాలో చెప్పుకోచ్చాడు రాజమౌళి. ఈ చిత్రాన్ని పద్మనాభరెడ్డి నిర్మిస్తుండగా.. బుర్రా సాయి మాధవ్ మాటలు అందిస్తున్నాడు.
Also Read:
బిగ్‌బాస్ విన్నర్ అభిజీత్‌కు లక్కీ ఛాన్స్.. ఒకేసారి మూడు సినిమాల్లో ఛాన్స్ ఇచ్చేసిన స్టార్ హీరో..