తండ్రి అయిన డైరెక్టర్ శ్రీరామ్‌ ఆదిత్య

|

Sep 13, 2020 | 8:01 PM

సుధీర్‌ బాబుతో తీసిన 'భలే మంచి రోజు' చిత్రంతో దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్నారు శ్రీరామ్‌ ఆదిత్య. ఆ తర్వాత  నలుగురు హీరోలతో 'శమంతకమణి' సినిమాతో పలకరించారు.

తండ్రి అయిన డైరెక్టర్ శ్రీరామ్‌ ఆదిత్య
Follow us on

సుధీర్‌ బాబుతో తీసిన ‘భలే మంచి రోజు’ చిత్రంతో దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్నారు శ్రీరామ్‌ ఆదిత్య. ఆ తర్వాత  నలుగురు హీరోలతో ‘శమంతకమణి’ సినిమాతో పలకరించారు. ఆ సినిమా అనంతరం కింగ్‌ నాగార్జున, నేచురల్‌ స్టార్‌ నాని కలిసి నటించిన ‘దేవదాస్‌’ చిత్రాన్ని రూపొందించి సత్తా చాటారు. తాజాగా ఎంపీ గల్లా జయదేవ్‌ తనయుడు గల్లా అశోక్‌ హీరోగా ఎంట్రీ ఇస్తున్న చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఈ రోజు ఆయన తనకు కొడుకు పుట్టినట్లుగా చెబుతూ.. ఓ పోస్టర్‌ని ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.

“13.09.2020 ఉదయం 10 గంటల 55 నిమిషాలకు తనకు బాబు పుట్టినట్లుగా వివరిస్తూ.. మా చిన్నారి వచ్చేశాడు.. అడ్వెంచర్ మొదలవుతోంది.. శ్రీరామ్‌ ఆదిత్య తుర్లపాటి, ప్రియాంక తుర్లపాటి..” అని పోస్టర్‌లో వెల్లడించారు. దీంతో నెటిజన్లు శ్రీరామ్‌ ఆదిత్య దంపతులకు విషెస్ తెలుపుతున్నారు పలువురు సెలబ్రిటీలు, నెటిజన్లు.

“వెయిటర్‌గా పనిచేస్తున్నప్పుడు, టిప్పుగా ఓ మహిళ కిస్ పెట్టింది”

దొంగతనానికి వచ్చి, గురకపెట్టి నిద్రపోయాడు