
సీనియర్ హీరో వెంకటేష్ తాజాగా సైంధవ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. గుంటూరు కారం, హనుమాన్, నా సామిరంగా సినిమాలకు పోటీగా సైంధవ్ సినిమా సంక్రాంతి బరిలో దిగింది. అయితే ఈ సినిమాకు ఆశించిన స్థాయిలో రిజల్ట్ రాలేదు. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కిన సైంధవ్ సినిమా మిక్స్డ్ టాక్ రావడంతో దర్శకుడు శైలేష్ స్పందించారు. నెగిటివ్ రివ్యూస్ పై శైలేష్ స్పందిస్తూ.. ఆస్కతికర కామెంట్స్ చేశాడు. సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదలైంది సైంధవ్. ఈ సినిమాలో వెంకటేష్ కు జోడీగా శ్రద్దా శ్రీనాథ్ నటించింది. అలాగే ఆండ్రియా, ఆర్య కీలక పాత్రలో నటించారు. బాలీవుడ్ విలక్షణ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ కూడా నటించారు.
ఇదిలా ఉంటె సైంధవ్ నెగిటివ్ రివ్యూస్ రావడంపై శైలేష్ మాట్లాడుతూ.. “ఏది ఏమైనా మంచి సినిమాకు ప్రేక్షకాదరణ లభిస్తుంది. మౌత్ టాక్పై నాకు నమ్మకం ఉంది. ఈ సంక్రాంతికి ప్రేక్షకులకు మేం విభిన్న కథా చిత్రాన్ని అందించాం. చాలా మంది థియేటర్లకు వెళ్లి ఈ సినిమాని చూస్తుండడం ఆనందంగా ఉంది’’ అని పేర్కొన్నారు శైలేష్.
వెంకటేష్ 75 వ సినిమాగా సైంధవ్ సినిమా తెరకెక్కింది. సైంధవ్ కోనేరు అలియాస్ సైకోగా వెంకటేశ్ మెప్పించారు. తండ్రి కూతురు ఎమోషనల్ డ్రామాగా ఈ సినిమాను తెరకెక్కించారు శైలేష్ . నవాజుద్దీన్ సిద్ధిఖీ తనదైన నటినతో ఈ సినిమాలో ఆకట్టుకున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.