
డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ మేనకోడలు, సినీ నిర్మాత, సెలబ్రిటీ ఫ్యాషన్ డిజైనర్ అయిన శ్రావ్య వర్మ, బ్యాడ్మింటన్ స్లార్ ప్లేయర్ కిదాంబి శ్రీకాంత్ తో కలిసి త్వరలోనే పెళ్లిపీటలెక్కనుంది.

గత కొన్నాళ్లుగా వీరిద్దరూ ప్రేమలో ఉన్నారు. ఆ తర్వాత పెద్దల అనుమతి కూడా లభించడంతో ఆగస్టులో సింపుల్ గా నిశ్చితార్థం చేసుకున్నారు.

ఇప్పుడు శ్రీకాంత్, శ్రావ్యల పెళ్లి వేడుకలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. తాజాగా జరిగిన ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో స్టార్ యాంకర్ సుమ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది.

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. పలువురు సినీ, క్రీడా ప్రముఖులు కాబోయే దంపతులకు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

కాగా శ్రావ్య వర్మ విజయ్ దేవరకొండ, అక్కినేని నాగార్జున, వైష్ణవ్ తేజ్, విక్రమ్ తదితర స్టార్ హీరోలకు పర్సనల్ స్టైలిస్ట్ గా పని చేసింది. ప్రస్తుతం రష్మిక మందన్న నటిస్తున్న ది గర్ల్ ఫ్రెండ్ సినిమాకు కూడా ఆమెనే కాస్ట్యూమ్ డిజైనర్ గా వ్యవహరిస్తోంది