
ప్రస్తుతం తెలుగులో ఉన్న స్టార్ హీరోలందరూ పాన్ ఇండియా సినిమాలతో బిజీ బిజీగా ఉంటున్నారు. అయితే ఈ మధ్యన కొందరి హీరోల సినిమాల విషయంలో డూప్స్, బాడీ డబుల్ అన్న పదాలు ఎక్కువగా వినిపించాయి. సాధారణంగా సినిమాల్లో డూప్స్ ను ఉపయోగిస్తుంటారు. అయితే ఆ విషయం బయటపడకుండా దర్శక నిర్మాతలు తగు జాగ్రత్తలు తీసుకుంటారు. సీన్స్ లో డూప్స్ ఉన్నారన్న విషయం తెలియకుండా మ్యానేజ్ చేస్తున్నారు. అయితే సోషల్ మీడియా వచ్చాక డూప్, బాడీ డబుల్ సీన్లను ఈజీగా పట్టేస్తున్నారు నెటిజన్లు. ఆ మధ్య భారీ అంచనాలతో రిలీజై డిజాస్టర్ గా నిలిచన ఓ సినిమా విషయంలో ఈ డూప్, బాడీ డబుల్ సీన్స్ నెట్టింట బాగా వైరలయ్యాయి. తాజాగా ఇదే విషయంపై ప్రముఖ నటుడు, దర్శకుడు రవిబాబు షాకింగ్ కామెంట్స్ చేశారు.టాలీవుడ్‌లో 90 శాతం మంది హీరోలు, డూపులనే ఉపయోగిస్తున్నారంటూ బాంబు పేల్చాడు.
సీనియర్ నటుడు చలపతిరావు వారసుడిగా ఇండస్ట్రీలోకి వచ్చాడు రవిబాబు. కెరీర్ ప్రారంభంలో కమెడియన్ గా, విలన్ గా నటించి మెప్పించాడు. ఆ తర్వాత అల్లరి సినిమాతో దర్శకుడిగానూ సక్సెస్ అయ్యాడు. ఆ తర్వాత నువ్విలా, నచ్చావులే, మనసారా, అనసూయ, అమరావతి, లడ్డూ బాబు, అవును, అదుగో, ఆవిరి తదితర సినిమాలతో ట్యాలెంటెడ్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు. ఇప్పుడు రేజర్ అనే మరో సినిమాతో ఆడియెన్స్ ముందుకు వస్తున్నాడు రవి బాబు. హై ఓల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుంది. మే 08న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ సినిమా ప్రమోషన్లలోనే మాట్లాడిన రవిబాబు డూప్స్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేశాడు.
‘నా సినిమాలో హీరోది మధ్య వయసు పాత్ర. దీని కోసం టాలీవుడ్‌లో ఎవరుంటారా అని చూస్తే ఒక్కరు కూడా కనిపించలేదు. ఎందుకంటే నాలా ఫిజికల్‌గా బలంగా ఉండి, నాలా నటించి వ్యక్తి ఎవరైనా ఉన్నారా అనుకుంటే ఎవ్వరూ దొరకలేదు. అందుకే నేనే చేశాను. అలానే మన దగ్గర 90 శాతం మంది హీరోలు డూప్స్ ఉపయోగిస్తుంటారు. నేను మాత్రం ఫైట్స్ సీన్స్‌లో మార్షల్ ఆర్ట్స్ లాంటివి, కిక్స్ నిజంగా ఫెర్ఫార్మ్ చేశాను’ అన రవిబాబు చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ డైరెక్టర్ కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.