The Girl Friend : రష్మిక ముఖంపై అన్ని రంగులెందుకు.. ? ది గర్ల్ ఫ్రెండ్ మూవీపై నెటిజన్ ప్రశ్న.. డైరెక్టర్ ఏమన్నారంటే..

కొన్నాళ్లుగా బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ అందుకుంటూ ఫుల్ జోష్ మీదున్న హీరోయిన్ రష్మిక మందన్నా. తెలుగు, హిందీ భాషలలో వరుస సినిమాలతో బిజీగా ఉంది ఈ అమ్మడు. అయితే కెరీర్ మంచి ఫాంలో ఉండగానే ది గర్ల్ ఫ్రెండ్ లాంటి లేడీ ఓరియెంటెడ్ మూవీతో మరో రిస్క్ చేసింది. ఈ సినిమా సైతం జనాలను విపరీతంగా ఆకట్టుకుంది.

The Girl Friend : రష్మిక ముఖంపై అన్ని రంగులెందుకు.. ? ది గర్ల్ ఫ్రెండ్ మూవీపై నెటిజన్ ప్రశ్న.. డైరెక్టర్ ఏమన్నారంటే..
Rahul Ravindran

Updated on: Dec 07, 2025 | 5:43 PM

ప్రస్తుతం పాన్ ఇండియా లెవల్లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అంటే ఠక్కున గుర్తొచ్చే పేరు రష్మిక మందన్న. తెలుగు, హిందీ భాషలలో బ్యాక్ టూ బ్యాక్ చిత్రాల్లో నటిస్తూ తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంటుంది. యానిమల్, పుష్ప 2, ఛావా, కుబేర, థామా సినిమాలతో హిట్స్ అందుకున్న ఈ అమ్మడు.. ఇప్పుడు ది గర్ల్ ఫ్రెండ్ సినిమాతో మరో హిట్ ఖాతాలో వేసుకుంది. నవంబర్ 7న విడుదలైన ఈ మూవీ దాదాపు రూ.28 కోట్లకు పైగానే రాబట్టింది. కన్నడ హీరో దీక్షిత్ శెట్టి, రష్మిక జంటగా నటించిన ఈ సినిమా యూత్ ను తెగ ఆకట్టుకుంది. ఇందులో మరోసారి తన అద్భుతమైన నటనతో మంచి మార్కులు కొట్టేసింది రష్మిక.

ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పణలో ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి నిర్మించగా.. నటుడు కమ్ డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించారు. ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో రష్మిక నటనపై ప్రశంసలు వచ్చాయి. తాజాగా ఓ నెటిజన్ మాత్రం ఈ మూవీలో రష్మిక లుక్ పై సందేహం వ్యక్తం చేశాడు. క్లైమాక్స్ సీన్ లో రష్మికకు ప్రత్యేకంగా రంగులతో లుక్ ఇవ్వడం వెనుక ఉన్న ఆలోచన ఏంటీ..? ఆమె ముఖం, దుస్తులపై అన్ని రంగులు ఎందుకు.. ? అర్జున్ రెడ్డి సినిమాకు.. ది గర్ల్ ఫ్రెండ్ మూవీకి ఏమైనా సంబంధం ఉందా ? అని ప్రశ్నించారు. దీంతో నెటిజన్ ప్రశ్నకు డైరెక్టర్ రాహుల్ స్పందించారు.

“లేదు మిత్రమా… ఈ మూవీకి వేరే ఏ సినిమాతోనూ సంబంధం లేదు. విక్రమ్ ఈ రంగులు/పెయింట్‌లను ఆమెను సిగ్గుపడేలా, ఆమెను అవమానించడానికి ఉపయోగిస్తాడు. ఆమె ఇప్పుడు దానిని స్వీకరించడం నేర్చుకుంది. అది ఇప్పుడు ఆమెలో ఒక భాగమని ఆమెకు తెలుసు. ఆ అంగీకారం ఆమెను బలంగా, అజేయంగా చేస్తుంది. అలాగే ఒకప్పుడు ఇంట్రోవర్ట్ గా ఉన్న వ్యక్తి… ఇప్పుడు మొత్తం కళాశాల ముందు ఈ రంగులతో నిలబడటానికి రెండుసార్లు ఆలోచించదు. దానిని చెప్పడానికి ఉద్దేశించినదే ఈ రంగుల ఎంపిక. సింపుల్ గా చెప్పాలంటే.. “మరి నీకు లేని సిగ్గు నాకెందుకు రా యెదవ!” అనేది అసలు పాయింట్” అంటూ ట్వీట్ చేశారు.

ఇవి కూడా చదవండి : Bigg Boss 9 Telugu : అబ్బ సాయిరాం.. ఒక్క మాటతో టాప్ 5కు.. ఓటింగ్‏లో దుమ్ములేపుతున్న డేంజర్ జోన్ కంటెస్టెంట్.. ఎలిమినేట్ అయ్యేది..