Hanuman Collections: ‘హనుమాన్’ విధ్వంసం.. ఇప్పట్లో ఆగేలా లేదుగా.. 25 రోజుల్లో సరికొత్త రికార్డ్..

డైరెక్టర్ ప్రశాంత్ వర్మ క్రియేటివిటీ.. డైరెక్షన్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు సినీ మేకర్స్. వీఎఫ్ఎక్స్ అద్భుతమని.. తేజా సజ్జా నటన బాగుందంటూ కొనియాడారు. ఈ మూవీ దాదాపు అన్ని వర్గాల వారిని మెప్పించి ఇంకా థియేటర్లలో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది. ఈ మూవీ విడుదలై మొత్తం 25 రోజులు గడుస్తున్నా.. ఇంకా హౌస్ ఫుల్ బోర్డ్స్ కనిపిస్తున్నాయి. ఇప్పటికే కలెక్షన్స్ విషయంలో అనేక రికార్డులు సెట్ చేసిన సినిమా హనుమాన్. ఇప్పుడు మరో రికార్డ్ క్రియేట్ చేసింది.

Hanuman Collections: హనుమాన్ విధ్వంసం.. ఇప్పట్లో ఆగేలా లేదుగా.. 25 రోజుల్లో సరికొత్త రికార్డ్..
Hanuman Movie

Updated on: Feb 06, 2024 | 2:57 PM

ఎన్నో సవాళ్లు..అడ్డంకులను ఎదుర్కొని పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించిన సినిమా ‘హనుమాన్’. చిన్న చిత్రంగా అడియన్స్ ముందుకు వచ్చిన ఈ మూవీ ఇప్పుడు భారీ విజయాన్ని అందుకుంది. సంక్రాంతి బరిలో మొత్తం నాలుగు సినిమాలు విడుదల కాగా.. ఇప్పటికీ వసూళ్లు సునామీ సృష్టిస్తుంది. డైరెక్టర్ ప్రశాంత్ వర్మ క్రియేటివిటీ.. డైరెక్షన్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు సినీ మేకర్స్. వీఎఫ్ఎక్స్ అద్భుతమని.. తేజా సజ్జా నటన బాగుందంటూ కొనియాడారు. ఈ మూవీ దాదాపు అన్ని వర్గాల వారిని మెప్పించి ఇంకా థియేటర్లలో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది. ఈ మూవీ విడుదలై మొత్తం 25 రోజులు గడుస్తున్నా.. ఇంకా హౌస్ ఫుల్ బోర్డ్స్ కనిపిస్తున్నాయి. ఇప్పటికే కలెక్షన్స్ విషయంలో అనేక రికార్డులు సెట్ చేసిన సినిమా హనుమాన్. ఇప్పుడు మరో రికార్డ్ క్రియేట్ చేసింది.

మొత్తం 25 రోజులకు గానూ ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ. 300 కోట్లు గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. ఈ విషయాన్ని చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించింది. సంక్రాంతికి రిలీజ్ అయిన సినిమా 25 రోజుల్లోనే రూ. 300 కోట్లు రాబట్టడం అంటే పెద్ద రికార్డే. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా నార్త్ ఇండియాలోనూ సత్తా చాటుతుంది. అలాగే అటు అమెరికాలోనూ దూసుకుపోతుంది ఈ మూవీ. అమెరికాలో మొత్తం 5 మిలియన్ డాలర్స్ పైగా వసూలు చేసింది. ఇక ఈ మూవీ మార్చ్ లో ప్రముఖ్ ఓటీటీ ప్లాట్ ఫాం జీ5లో వస్తుందని సమాచారం.

92 ఏళ్ల టాలీవుడ్ సినీ చరిత్రలో ఆల్ టైమ్ సంక్రాంతి బ్లాక్ బస్టర్ హిట్ చిత్రంగా హనుమాన్ నిలిచింది. ఈ చిత్రానికి జై హనుమాన్ రానుంది. కొన్ని రోజుల క్రితమే ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రారంభమయ్యాయి. ఈ సినిమాలోని ప్రధాన పాత్రలో టాలీవుడ్ స్టార్ హీరో కనిపించనున్నారని టాక్ వినిపిస్తుంది. ఇందులో అమృతా అయ్యార్, వినయ్ రాయ్, వరలక్ష్మి శరత్ కుమార్ కీలకపాత్రలలో నటించారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.