ఎన్టీఆర్ అద్భుతంగా డైలాగ్ చెప్పగానే ఆ హీరోయిన్ కన్నీళ్లుపెట్టుకుంది.. సెట్‌లో అందరూ షాక్ అయ్యాం..

పాన్ ఇండియా స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో డ్రాగన్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. భారీ యాక్షన్ డ్రామాగా వస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. భారీ బడ్జెట్ యాక్షన్ డ్రామాగా వస్తున్న ఈ చిత్రంలో కన్నడ స్టార్ హీరోయిన్ రుక్మిణి వసంత్ కథానాయికగా నటిస్తుంది.

ఎన్టీఆర్ అద్భుతంగా డైలాగ్ చెప్పగానే ఆ హీరోయిన్ కన్నీళ్లుపెట్టుకుంది.. సెట్‌లో అందరూ షాక్ అయ్యాం..
Ntr

Updated on: May 28, 2026 | 1:02 PM

దర్శకుడు కృష్ణవంశీ చివరిగా రంగమార్తాండ సినిమాతో ప్రేక్షకులను అలరించారు. ఈ సినిమా తర్వాత ఆయన మరో సినిమా చేయలేదు. ఇక ఇప్పుడు ఆయన సినిమా కోసం ప్రేక్షకులంతా ఈగర్ గా ఎదురుచూస్తున్నారు.  గతంలో ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తన దర్శకత్వ విధానంలో స్పాట్ ఇంప్రోవైజేషన్‌కు ఎంతగా ప్రాధాన్యత ఇస్తారో వివరించారు. గోవిందుడు అందరివాడేలే సినిమా చిత్రీకరణ సమయంలో రామ్ చరణ్‌తో జరిగిన సంఘటనలను ఆయన గుర్తు చేసుకున్నారు. నటీనటులు ముందుగానే డైలాగ్స్ సిద్ధం చేసుకుని వస్తారని, అయితే తన దృష్టిలో ఆ సన్నివేశానికి అవసరమైన భావోద్వేగం, సహజత్వం ముఖ్యమని కృష్ణవంశీ అన్నారు. కొత్త నటులు తన శైలికి అలవాటు పడటానికి రెండు మూడు రోజులు పడుతుందని, ఆ తర్వాత వారే స్వయంగా స్పాట్‌లో తన సూచనల కోసం ఎదురుచూస్తారని ఆయన పేర్కొన్నారు. డైలాగ్ ముందుగా సిద్ధం చేసినట్లు కాకుండా, సహజ మాట్లాడుకుంటున్నట్టు ఉండాలని ఆయన అన్నారు.

ఇది కూడా చదవండి : అప్పట్లో కుర్రాళ్ళ డ్రీమ్ గర్ల్.. అండర్ వరల్డ్ మాఫియా దెబ్బకు రాత్రికి రాత్రే మాయం..

జూనియర్ ఎన్టీఆర్ నటించిన రాఖీ చిత్రంలోని కోర్టు డైలాగ్ సన్నివేశం గురించి కృష్ణవంశీ కీలక విషయాలను వెల్లడించారు. ఆ డైలాగ్ ముందుగా రాసిపెట్టింది కాదని, స్పాట్ లోనే రూపుదిద్దుకుందని ఆయన స్పష్టం చేశారు. ఈ డైలాగ్ కోసం పరుచూరి గోపాలకృష్ణతో ఒక వెర్షన్ రాయించి, ఆ తర్వాత ఉత్తేజ్‌తో మరో వెర్షన్ రాయించారని తెలిపారు. ఈ రెండు వెర్షన్లను పరిశీలించిన తర్వాత, తానే స్వయంగా కూర్చుని ఆ డైలాగ్‌ను తిరిగి రాశారని తెలిపారు. ఉత్తేజ్ కంటెంట్ తన రచనలో ఎక్కువ భాగం ఉందని ఆయన అన్నారు.

ఇది కూడా చదవండి : Jabardasth: జబర్దస్త్‌లో అతను చాలా కమర్షియల్.. భోజనానికి రమ్మని పిలిస్తే పెట్రోల్‌కు డబ్బులు అడుగుతాడు..

జూనియర్ ఎన్టీఆర్ అసాధారణమైన జ్ఞాపకశక్తిని గురించి కృష్ణవంశీ తెలిపారు. రాఖీ చిత్రంలో పది నిమిషాల నిడివి గల క్లైమాక్స్ డైలాగ్‌ను ఎన్టీఆర్ ఎలాంటి పొరపాటు లేకుండా ఒకేసారి చెప్పారని ఆయన గుర్తు చేసుకున్నారు. ఈ సన్నివేశం చిత్రీకరణ సమయంలో నటి సుహాసిని కూడా అక్కడే ఉన్నారని, ఎన్టీఆర్ డైలాగ్ చెప్పగానే ఆమె కళ్ల నుంచి కన్నీళ్లు కారుతున్నాయని కృష్ణవంశీ తెలిపారు. తారక్ డైలాగ్ చెప్పగానే సుహాసిని తన కన్నీళ్లు తుడుచుకుని పక్కకు వెళ్లిపోయారని ఆయన వివరించారు. తారక్ అద్భుతమైన నటన చూసి చిత్ర బృందం అంతా షాక్ అయిపోయిందని, కొద్దిసేపు ఎవ్వరి నోటి వెంట మాటరాలేదని కృష్ణవంశీ అన్నారు. ఎన్టీఆర్ వంటి అద్భుతమైన జ్ఞాపకశక్తి మహేష్ బాబు, ప్రకాష్ రాజ్ వంటి కొద్దిమంది నటులలో కూడా ఉందని కృష్ణవంశీ అన్నారు.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి : ఆ ఇద్దరు హీరోలతో సినిమాలు చేయాలనుంది.. ఎప్పుడు ఛాన్స్ వస్తుందో చూడాలి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us