Mrunal Thakur: ‘ప్రతి ఫ్రేమ్ ఒక పెయింటింగా వుంటుంది’.. మృణాల్ ఠాకూర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

దుల్కర్ సల్మాన్ సినిమాలకు తెలుగులోనూ మంచి క్రేజ్ ఉంది. ఈ యంగ్ హీరో సినిమాలు తెలుగు ప్రేక్షకులను కూడా బాగా అలరిస్తూ ఉంటాయి. ఓకే బంగారం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన దుల్కర్.

Mrunal Thakur: 'ప్రతి ఫ్రేమ్ ఒక పెయింటింగా వుంటుంది'.. మృణాల్ ఠాకూర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Mrunal Thakur
Follow us

|

Updated on: Jul 05, 2022 | 8:16 PM

దుల్కర్ సల్మాన్(Dulquer Salmaan) సినిమాలకు తెలుగులోనూ మంచి క్రేజ్ ఉంది. ఈ యంగ్ హీరో సినిమాలు తెలుగు ప్రేక్షకులను కూడా బాగా అలరిస్తూ ఉంటాయి. ఓకే బంగారం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన దుల్కర్. ఆతర్వాత మహానటి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. తాజాగా ఈ కుర్ర హీరో నటిస్తున్న సినిమా సీతారామం. ఇప్పటికే ఈ సినిమానుంచి విడుదలైన పోస్టర్లు, పాటలు ప్రేక్షులను ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ సినిమానుంచి ఓ అందమైన మెలోడీని విడుదల చేశారు. ఈ సాంగ్ లాంచ్ సందర్భంగా దర్శకుడు హను రాఘవపూడి మాట్లాడుతూ.. ఇది చాలా సవాల్ తో కూడిన పాట. నాకు ఇష్టమైన పాట. గేయ రచయిత కృష్ణకాంత్ అద్భుతంగా రాశారు. వేటూరి గారు గుర్తుకొచ్చారు. ‘చిలకే కోక కట్టి నిన్నే చుట్టుముట్టి సీతాకోకలైనా, అందం నీ ఇంట చేస్తుందా ఊడిగమే.. అనే ఎక్స్ ప్రెషన్స్ అద్భుతంగా అనిపించాయి. విశాల్ ఈ పాటని ఒక రోజులో చాలా ఆర్గానిక్ గా క్రియేట్ చేశారు. రాయడానికి మాత్రం చాలా సమయం పట్టింది. ఈ పాటలో దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ ముచ్చటగా వుంటారు. దిష్టి తీయాలనిపిస్తుంది. ఇంత అద్భుతంగా చూపించిన పీఎస్ వినోద్ గారికి కృతజ్ఞతలు” తెలిపారు.

మృణాల్ ఠాకూర్ మాట్లాడుతూ.. ఈ పాట విన్న ప్రతిసారి మనసు హాయిగా వుంటుంది. ప్రేక్షకులు ‘సీతా రామం’ అమితంగా ప్రేమిస్తారు. ప్రతి ఫ్రేమ్ ఒక పెయింటింగా వుంటుంది. ‘సీతా రామం’ గొప్ప కథ. రామ్ గా దుల్కర్ సల్మాన్ అద్భుతంగా కనిపిస్తారు. దుల్కర్ సల్మాన్ గారితో పని చేయడం గొప్ప అనుభవం. ఈ ఇంత భారీ చిత్రంలో నాకు అవకాశం ఇచ్చిన నిర్మాతలు స్వప్న, వైజయంతి మూవీస్, దర్శకుడు హను రాఘవపూడి గారికి కృతజ్ఞతలు” తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి