Director Gunasekhar : అలా అడిగితే భూమిక నన్ను కొడుతుందేమో అనుకున్నా.. డైరెక్టర్ గుణశేఖర్ కామెంట్స్..

టాలీవుడ్ ఇండస్ట్రీలో సక్సెస్ ఫుల్ డైరెక్టర్లలో గుణశేఖర్ ఒకరు. చివరగా శాకుంతలం సినిమాతో ప్రేక్షకులను అలరించిన ఆయన.. ఆ తర్వాత మరో ప్రాజెక్ట్ అనౌన్స్ చేయలేదు. దాదాపు మూడేళ్ల తర్వాత యుఫోరియా అనే సినిమాతో మరోసారి థియేటర్లలో సందడి చేయనున్నారు. ఇందులో యంగ్ హీరోయిన్ సారా అర్జున్ ప్రధాన పాత్రలో నటించింది. ఈ మూవీ ప్రతి ఒక్కరికీ ఎమోషనల్ గా కనెక్ట్ అవుతుందని గుణశేఖర్ వెల్లడించారు.

Director Gunasekhar : అలా అడిగితే భూమిక నన్ను కొడుతుందేమో అనుకున్నా.. డైరెక్టర్ గుణశేఖర్ కామెంట్స్..
Director Gunasekhar

Updated on: Jan 18, 2026 | 7:20 AM

తెలుగు సినీప్రియులకు డైరెక్టర్ గుణశేఖర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఇప్పటివరకు తెలుగులో ఎన్నో విభిన్న కథలను తెరకెక్కించారు. రుద్రమదేవి, శాకుంతలం వంటి చిత్రాలతో ప్రేక్షకులను అలరించారు. చివరగా సమంత ప్రధాన పాత్రలో శాకుంతలం మూవీతో అడియన్స్ ముందుకు వచ్చారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రానికి ఆశించిన స్థాయిలో రివ్యూస్ రాలేదు. దీంతో కొన్నాళ్లు గ్యాప్ తీసుకుని.. ఇప్పుడు మూడేళ్ల తర్వాత యుఫోరియా సినిమాను రూపొందిస్తున్నారు. ఇందులో సీనియర్ హీరోయిన్ భూమిక, సారా అర్జున్, గౌతమ్ వాసుదేవ్ మీనన్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ మూవీ ఫిబ్రవరి 6న థియేటర్లలో విడుదల కానుంది. తాజాగా ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ట్రైలర్ రిలీజ్ చేసింది చిత్రయూనిట్. ఈ క్రమంలోనే డైరెక్టర్ గుణశేఖర్ ఆసక్తికర కామెంట్స్ చేశారు.

ఎక్కువ మంది చదివినవి : Actress Raasi: ఉదయాన్నే 4 గంటలకు ఆ పనులు చేస్తా.. నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..

యుఫోరియా సినిమా ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతుందని అన్నారు. కొత్త వాళ్లతోనే ఈ సినిమా చేయాలని దాదాపు ఆరు నెలలపాటు ఆడిషన్స్ చేశామని.. 20 మంది వరకు కొత్తవారిని తీసుకున్నామని.. ఎలాంటి రికమండేషన్ లేకుండా కేవలం ఆడిషన్స్ చేసి టాలెంట్ చూసి సెలక్ట్ చేసినట్లు చెప్పారు. సినిమాలో 17 ఏళ్ల అమ్మాయి పాత్ర అవసరమైందని.. కథ వింటున్నప్పుడే పొన్నియన్ సెల్వన్ మూవీ చేసిన సారా అర్జున్ బాగుంటుందని తన కూతురు నీలిమ చెప్పిందని అన్నారు. సారా అర్జున్ చాలా మెచ్యూర్ గా ఆలోచిస్తుందని.. సినిమా గురించి చెప్పగానే వాళ్ల నాన్న ఓకే చేశారని తెలిపారు. ఇక తర్వాత ఈ సినిమాలో భూమిక తల్లి పాత్రలో కనిపించనుందని అన్నారు.

“వింధ్య పాత్ర సినిమాకు బ్యాక్ బోన్. ఆ పాత్ర కోసం ఎవరిని తీసుకుందామని ఆలోచించగా.. భూమిక బాగుంటుందని మా అమ్మాయి చెప్పింది. కానీ నేను వద్దన్నాను. ఎందుకంటే భూమికను తల్లిగా చూడడం నాకు ఇష్టం లేదు. భూమిక అంటే నా స్వప్న (ఒక్కడు సినిమాలో భూమిక పాత్ర పేరు). అలాంటి అమ్మాయి 17 ఏళ్ల కుర్రాడికి తల్లి ఏంటీ అనిపించింది. కానీ ఆ పాత్రకు ఆమె న్యాయం చేయగలదు అనిపించింది. ముందుగా తల్లి క్యారెక్టర్ అని అడిగితే భూమిక నన్ను కొడుతుందేమో అనుకున్నా.. భయపడతూనే అడిగాను. స్క్రిప్ట్ చదివి ఒకే చెప్పింది” అని అన్నారు.

ఎక్కువ మంది చదివినవి : Prabhas: ప్రభాస్ ఆకలి కోసం నేను దొంగతనం చేయాల్సి వచ్చింది.. ఆరోజు రాత్రి.. డార్లింగ్ బెస్ట్ ఫ్రెండ్ కామెంట్స్..

 

ఎక్కువ మంది చదివినవి : Child Artist: షూటింగ్‏లో యాక్సిడెంట్.. 2 ఏళ్లు నరకం అనుభవించా.. సూర్యవంశం చైల్డ్ ఆర్టిస్ట్..