మెగా మేనల్లుడిగా టాలీవుడ్లోకి హీరోగా ఉప్పెన సినిమాతో ఎంట్రీ ఇచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు వైష్ణవ్ తేజ్. ఇందులో వైష్ణవ్‌కు జోడీగా కృతి శెట్టి హీరోయిన్గా నటించింది. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సాన దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా.. మంచి హిట్ అందుకోవడమే కాకుండా భారీగా వసూళ్లను కూడా రాబట్టిన సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ – సుకుమార్ రైటింగ్స్ కలసి నిర్మించిన ఈ చిత్రం వంద కోట్ల గ్రాస్ వసూలు చేసింది. చక్కటి ప్రేమకథతోపాటు సాంగ్స్ కూడా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ అందించిన సంగీతం సినిమాను మరో మెట్టు పైకెక్కించింది. ముఖ్యంగా నీకన్ను నీలి సముద్రం అనే పాట యువతను విపరీతంగా ఆకట్టుకుంది. అలాగే జలజల జలపాతం అంటూ సాగే పాటకూడా మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. ప్రస్తుతం ఈ మూవీ మేకింగ్ వీడియోలను ఒక్కక్కటిగా విడుదల చేస్తున్నారు మేకర్స్.
ఇటీవల జల జల జలపాతం మేకింగ్ వీడియోను చేసాడు డైరెక్టర్ … తాజాగా ఈ మూవీ మేకింగ్ వీడియోను రిలీజ్ చేశాడు. ఈ వీడియోలలో బేబమ్మగా నటించడానికి కృతిశెట్టి ఎంతకష్టపడిందో అర్థమవుతుంది. అలాగే ఆ సినిమా కోసం డైలాగ్స్ చెప్పడానికి కృతి ప్రయత్నిస్తున్న సీన్స్ కూడా చూడొచ్చు. అలాగే బుచ్చిబాబు.. లోకెషన్లో ఎంత కచ్చితంగా.. హుషారుగా ఉన్నాడో కూడా చూడొచ్చు. అలాగే యాక్షన్స్ సీన్స్ ఎలా చిత్రీకరించి.. క్లాస్ రూమ్ సీన్స్ ఎలా తీశారు అనేది కూడా చూడోచ్చు.
వీడియో..
వీడియో..
Also Read: Akhil Movie: టాలీవుడ్ యంగ్ హీరో కోసం సూపర్ స్టార్.. అఖిల్ ఏజెంట్ కోసం స్పెషల్ రోల్లో…
తగ్గేదే లే అంటున్న నేచరల్ స్టార్ నాని.. వరుస సినిమాలతో ఫుల్ జోష్‌లో ఉన్న శ్యాం సింగరాయ్..
మయురంతో ఆటలాడపోయిన ముద్దుగుమ్మ.. అంతలోనే ఉహించని ఘటన.. షాక్ తిన్న హీరోయిన్..
షాకింగ్ లుక్‌లో రెబల్ స్టార్.. మీరెప్పుడైన ప్రభాస్‌ను ఇలా చూశారా ? సోషల్ మీడియాలో ఫోటో వైరల్..