
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్ కాంబినేషన్‌లో వస్తున్న లేటెస్ట్ సినిమా కోసం సినీ ప్రేమికులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నిజానికి అనిల్ రావిపూడి సినిమాలపై ముందు నుంచి ప్రేక్షకులలో మంచి క్యూరియాసిటీ ఉంటుంది. అలాగే ఆయన చేసే ప్రమోషన్స్ సైతం మూవీపై హైప్ క్రియేట్ చేస్తాయి. సరికొత్త కంటెంట్ తో తన సినిమాను జనాల్లోకి తీసుకెళ్తారు. ఇదివరకే వెంకీ, కళ్యాణ్ రామ్ కాంబోలో సినిమా రాబోతుందని తనదైన స్టైల్లో ప్రకటించారు. తాజాగా ఈ సినిమాలో మ్యూజిక్ డైరెక్టర్ గురించి చెబుతూ షేర్ చేసిన వీడియో ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లోకి తాజాగా ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్, నటుడు జీవీ ప్రకాష్ కుమార్ అధికారికంగా ఎంట్రీ ఇచ్చారు. ఈ సందర్భంగా అనిల్ రావిపూడి తనదైన శైలిలో విడుదల చేసిన వెల్కమ్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఎక్కువమంది చదివినవి : Sridevi Vijaykumar : ఇప్పుడున్న హీరోలలో అతడంటే పిచ్చి ఇష్టం.. అతడే నా ఫేవరేట్.. హీరోయిన్ శ్రీదేవి విజయ్ కుమార్..
సాధారణంగానే అనిల్ రావిపూడి సినిమాల్లో వినోదం, కామెడీకి పెద్ద పీట వేస్తుంటారు. ఇప్పుడు ఈ కొత్త సినిమా కోసం ఆయన జీవీ ప్రకాష్‌ను ఆహ్వానించిన తీరు అందరినీ ఆకట్టుకుంటోంది. వీడియోలో అనిల్ రావిపూడి తనదైన ఫన్నీ మార్కుతో జీవీ ప్రకాష్‌ను టీమ్ లోకి స్వాగతించారు. జంధ్యాల తెరకెక్కించిన సినిమాలోని ఒక క్లాసిక్ సీన్ ను రీక్రియేట్ చేస్తూ సముద్ర తీరాన ఉన్న ఇసుకలో మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ ను తలవరకు ముంచేశారు. మరోవైపు అటు లిరిక్ రైటర్ అనంత శ్రీరామ్ ను సైతం తల వరకు ఇసుకలో ముంచేశారు. ఇద్దరితో కలిసి తనదైన స్టైల్లో మాట్లాడుతూ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు. సంగీతంతో మ్యాజిక్ చేయగల జీవీ ప్రకాష్ రాకతో, ఈ సినిమాలోని పాటలు, నేపథ్య సంగీతం ఏ స్థాయిలో ఉండబోతున్నాయో ఊహించుకోవచ్చని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.
ఎక్కువమంది చదివినవి : Mahesh Babu: మహేష్ ఇమేజ్‌కు ఆ సినిమా కరెక్ట్ కాదు.. నేను వినుంటే వద్దనేవాడిని.. సూపర్ స్టార్ కృష్ణ..
వెంకటేష్-అనిల్ రావిపూడి కలయికలో ఇప్పటికే ‘ఎఫ్ 2’, ‘ఎఫ్ 3’ వంటి బ్లాక్ బస్టర్ విజయాలు ఉన్నాయి. ఈసారి హ్యాట్రిక్ కొట్టాలనే లక్ష్యంతో ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి జీవీ ప్రకాష్ సంగీతం అందిస్తుండటంతో, టెక్నికల్ పరంగా కూడా సినిమా మరో స్థాయికి వెళ్తుందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. వైవిధ్యమైన కథాంశంతో, పూర్తిస్థాయి వినోదభరితమైన చిత్రంగా ఇది రూపొందనుంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు తుది దశలో ఉన్నాయి. జీవీ ప్రకాష్ మ్యూజిక్ టీమ్‌లో చేరడంతో, పాటల రికార్డింగ్ కూడా త్వరలోనే ప్రారంభం కానుంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన మరిన్ని వివరాలు, హీరోయిన్ ఎవరనేది త్వరలోనే చిత్ర యూనిట్ ప్రకటించే అవకాశం ఉంది.
ఎక్కువమంది చదివినవి : Trending Song : ఏం పాట మావ.. 22 సంవత్సరాలుగా యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న లవ్ సాంగ్.. అమ్మాయిలు పిచ్చెక్కిపోయారు
I've always admired @gvprakash's ability to make music that connects instantly with audiences.👌🏻
Thrilled to welcome him on board for #VenkyAnil5 – #NKRAnil2 🤗
And we had a blast pulling off this fun concept…
A big thank you to GV for trusting the idea, joining in… pic.twitter.com/AeAMx5hJbd— Anil Ravipudi (@AnilRavipudi) June 12, 2026
ఎక్కువమంది చదివినవి : Jai Chiranjeeva: చిరంజీవి మేనకోడలు ఇంత మారిపోయింది మావా.. ? గ్లామరస్ లుక్కులో అదిరిపోయిన జై చిరంజీవి చైల్డ్ ఆర్టిస్ట్..