
టాలీవుడ్ సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ప్రమోషన్స్ చేయడంలో ఎప్పుడూ ఒక అడుగు ముందే ఉంటారు. తన సినిమాల ప్రకటనల దగ్గర నుంచి సరికొత్త ఐడియాలతో ప్రేక్షకుల్లో విపరీతమైన క్యూరియాసిటీని పెంచుతుంటారు. తాజాగా విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్ కలయికలో ఆయన తెరకెక్కిస్తున్న భారీ క్రేజీ మల్టీస్టారర్ చిత్రం (#VenkyAnil5 / #NKRAR2) రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది. ఈ సందర్భంగా చిత్ర బృందం విడుదల చేసిన ‘కత్తిలాంటి ఐడియా’ ప్రమోషనల్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతూ నవ్వులు పూయిస్తోంది. ఇటీవలే వైజాగ్ బీచ్ ఇసుకలో మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ కుమార్, గేయ రచయిత అనంత్ శ్రీరామ్‌లను పాతిపెట్టి ట్యూన్స్ చేయించిన అనిల్.. ఈసారి మరింత విభిన్నమైన కాన్సెప్ట్‌తో వచ్చారు.
ఈ సరికొత్త వీడియోలో అనిల్ రావిపూడి తలపాగా చుట్టుకుని, చేతిలో ఒక పెద్ద కత్తితో చాలా సీరియస్‌గా ఎంట్రీ ఇస్తారు. ఫ్యాన్స్ తనకు ‘కాన్సెప్ట్ కింగ్’ అనే బిరుదు ఇచ్చారని చెప్తూ.. ఈసారి తన సినిమా ప్రమోషన్స్ కోసం టీమ్ నుండి ఒక ‘కత్తిలాంటి ఐడియా’ అడుగుతారు. వెంటనే వెంకటేష్ స్పందిస్తూ, “నేను ఇస్తాను కత్తిలాంటి ఐడియా” అంటూ అనిల్ చేతిలోని కత్తిని లాక్కుని, ఆయన బోటని వేలిని కొద్దిగా కోసి (సరదాగా ఎడిట్ చేసిన సీన్) ఆ రక్తంతో అనిల్‌కే ‘వీర తిలకం’ దిద్దుతారు. ఆ వెంటనే కళ్యాణ్ రామ్ కూడా “నేను కూడా మరో హీరోని కదా” అంటూ అదే విధంగా అనిల్ చేయి కోసి తిలకం పెడతారు. ఇక హీరోయిన్లు కీర్తి సురేష్, కృతి శెట్టిలు కూడా తామేం తక్కువ కాదంటూ వచ్చి అదే పని చేయడంతో అనిల్ రావిపూడి భయపడిపోతారు. పక్కనే ఉన్న జీవీ ప్రకాష్ ఇదంతా చూసి ముసిముసి నవ్వులు నవ్వుకుంటారు.
“ఎంత మనది రాయలసీమ బ్యాక్‌డ్రాప్ అయితే మాత్రం.. మరీ అంత రక్తపాతం అవసరమా? మనది ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ కదా” అంటూ అనిల్ చెప్పే డైలాగులు థియేటర్ స్థాయి నవ్వులను తెప్పిస్తున్నాయి. ఈ వీడియో ద్వారా అనిల్ రావిపూడి ఈసారి సరికొత్త రాయలసీమ నేపథ్యంలో నవ్వుల జాతరను చూపించబోతున్నట్లు స్పష్టమైంది. సాధారణంగా రాయలసీమ అనగానే ఫ్యాక్షన్, బాంబులు, కత్తుల రక్తపాతం గుర్తొస్తాయి. కానీ అనిల్ మార్క్ స్టైల్లో ఈ ప్రాంతాన్ని ఒక అద్భుతమైన ఫ్యామిలీ అండ్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా చూపించబోతున్నారు. షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి నిర్మిస్తున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని వచ్చే ఏడాది (2027) సంక్రాంతి కానుకగా భారీ ఎత్తున విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ ఫన్నీ వీడియోతో సినిమాపై అంచనాలు ఒక్కసారిగా ఆకాశాన్నంటాయి.
ఎక్కువ మంది చదివినవి : ఇప్పుడున్న హీరోలలో అతడు ది బెస్ట్.. అతడి యాక్టింగ్ అంటే చాలా చాలా ఇష్టం.. కృష్ణ మనసులోని మాట..