
చాలా మంది హీరోయిన్స్ వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. కొంతమంది హిట్లు ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తున్నారు. కొంతమంది మాత్రం ఆచితూచి అడుగులేస్తున్నారు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేయకుండా కంటెంట్ ఉన్న కథలను ఎంచుకుంటూ సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. వారిలో పైన కనిపిస్తున్న ముద్దుగుమ్మ ఒకరు. ఆమె అందం, అభినయం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. చేసింది తక్కువ సినిమాలే అయినా కూడా ఈ చిన్నది మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ బ్యూటీ సినిమాలకోసం ఆమె ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. పై ఫొటోలో కనిపిస్తున్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.? వర్షంలో తడిసి ముద్దవుతున్న ఆ వయ్యారి ఎవరో గుర్తుపట్టారా.?
ఆమె మరెవరో కాదు.. హీరోయిన్ నివేదా థామస్.. ఈ ముద్దుగుమ్మ గురించి సౌత్ సినీప్రియులకు ప్రత్యేకంగా పరిచయం అవసరంలేదు. బాలనటిగా సినీప్రయాణం స్టార్ట్ చేసిన ఈ అమ్మడు తమిళం, మలయాళం భాషలలలో అనేక చిత్రాల్లో నటించింది. జెంటిల్ మెన్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన నివేదా.. ఆ తరవాత టాలీవుడ్ ఇండస్ట్రీలో పలు సినిమాల్లో మెరిసింది. తెలుగులో చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ అమ్మడు. అందం, అభినయంతో మంచి మార్కులు కొట్టేసినప్పటికీ నివేదాకు తెలుగులో అంతగా ఆఫర్స్ రాలేదు.
దీంతో కొన్నాళ్లపాటు ఇండస్ట్రీకి దూరంగా ఉండిపోయింది. ఆమధ్య 35 చిన్న కథ కాదు సినిమాతో మరోసారి అడియన్స్ మందుకు వచ్చింది. ఇందులో ఇద్దరు పిల్లల తల్లి పాత్రలో అద్భుతమైన నటనతో కట్టిపడేసింది. ఈ సినిమాకు ఊహించని స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. ఇందులో నివేదా నటనకు ప్రశంసలు అందుకున్న సంగతి తెలిసిందే. ఇక ఇటీవల 35 చిన్న కథ కాదు చిత్రానికి గానూ ఉత్తమ నటిగా గద్దర్ అవార్డ్ ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం. ఇక ఈ చిన్నది సోషల్ మీడియాలో ఈ బ్యూటీ చాలా యాక్టివ్ గా ఉంటుంది. రెగ్యులర్ గా ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ వర్షంలో తడుస్తున్న వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ వీడియో వైరల్ అవుతుంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.