Google: గూగుల్ డూడుల్‌లో ఉన్న ఈ మహిళ ఎవరో గమనించారా..? ఆమె మరెవరో కాదు..

|

Feb 10, 2023 | 3:00 PM

తాజాగా ఈ రోజు (ఫిబ్రవరి 10న) ఒక మహిళకు సంబంధించిన డూడూ ను ఉపయోగించింది గూగుల్. ఇంతకు ఆమె ఎవరు అంటూ నెటిజన్లు తెగ వెతికేస్తున్నారు.

Google: గూగుల్ డూడుల్‌లో ఉన్న ఈ మహిళ ఎవరో గమనించారా..? ఆమె మరెవరో కాదు..
Google
Follow us on

ఎంతో ప్రముఖం అయితే తప్ప గూగుల్ డూడూలో ఫోటోలు వేయరు. ఇప్పటికే చాలా మంది ప్రముఖులకు సంబంధించిన డూడుల్‌ను గూగుల్ ఉపయోగించింది. తాజాగా ఈ రోజు (ఫిబ్రవరి 10న) ఒక మహిళకు సంబంధించిన డూడూ ను ఉపయోగించింది గూగుల్. ఇంతకు ఆమె ఎవరు అంటూ నెటిజన్లు తెగ వెతికేస్తున్నారు. ఈ మధ్య కాలంలో గూగుల్ డూడుల్‌ నెటిజన్లను తెగ ఆకట్టుకుంటున్నాయి. రకరకాల డూడుల్‌ లతో నెటిజన్లను ఆకర్షిస్తోన్న గూగుల్ తాజాగా ఒక మహిళ డూడూ ప్రత్యేక్షం అయ్యింది. ఇంతకు ఆమె ఎవరంటే..

గూగుల్ లో కనిపిస్తోన్న ఆ మహిళ ఒక సినిమా తార. ఆమె పేరు పి కే రోజీ. ఆమె మలయాళ సినిమాల్లో మొదటి నటి. 10 ఫిబ్రవరి, 1903న జన్మించారు. ఆమె JC డేనియల్ దర్శకత్వం వహించిన విగతకుమారన్ (ది లాస్ట్ చైల్డ్) లో నటించింది. రోజీ 1988లో మరణించారు. ఇక కెరీర్ బిగినింగ్ లో ఆమె చాలా చేదు సంఘటనలు ఎదుర్కొన్నారని తెలుస్తోంది. అయినప్పటికీ ఆమె హీరోయిన్ గా ఎదిగి ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచారు.

మలయాళ సినిమా ఇండస్ట్రీలో మొదటి నటి అయిన రోజీ పుట్టిన రోజు కావడంతో ఆమెను గుర్తు చేసుకుంటూ గూగుల్ డూడుల్‌ క్రియేట్ చేశారు.Pk Rosy