Comedian Ali : కమెడియన్ అలీకి ఆ సమస్య ఉందని మీకు తెలుసా..? అయినా కూడా..
దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు సీతాకోక చిలుక సినిమాతో బాలనటుడిగా కెరీర్ ను స్టార్ట్ చేసిన అలీ. ఆ తర్వాత వరుస సినిమాలతో ఫుల్ బిజీగా మారిపోయారు
ఎంతమంది కమెడియన్స్ తెలుగులో వచ్చినా కూడా తనకు మాత్రం తానే పోటీ అంటూ దూసుకుపోతున్నారు అలీ. ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ కమెడియన్ గా రాణిస్తున్నారు అలీ. దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు సీతాకోక చిలుక సినిమాతో బాలనటుడిగా కెరీర్ ను స్టార్ట్ చేసిన అలీ. ఆ తర్వాత వరుస సినిమాలతో ఫుల్ బిజీగా మారిపోయారు. దాదాపు వెయ్యి సినిమాలకు పైగా నటించి మెప్పించారు. కేవలం అలీ కోసమే సినిమాలకు వెళ్లే వాళ్ళు కూడా ఉన్నారు. ప్రస్తుతం పలు టాక్ షోలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. మరో వైపు రాజకీయాల్లోనూ చాలా యాక్టివ్ గా ఉంటున్నారు అలీ. ఇటీవలే అలీని ఏపీ ప్రభుత్వం ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుడిగా నియమించింది.
అయితే అలీకి ఒక సమస్య ఉందని మీకు తెలుసా.. అలీకి నత్తి. ఆయన అట్లాగే సమయంలో కొన్నిసార్లు మాట తడబడుతుంది. అయినా కూడా సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ ఫుల్ గా ఎదిగారు అలీ. తనకున్న వైకల్యాన్ని కూడా ఆయన కొన్ని సినిమాల్లో కామెడీగా మార్చి ప్రేక్షకులను నవ్వించారు.
అలీ ప్రస్తుతం అడపాదపా సినిమాల్లో కనిపిస్తున్నారు. కొత్త కొత్త కమెడియన్స్ రావడం.. పైగా హీరోలే ఇప్పుడు కామెడీ చేస్తుండటంతో అలీకి అవకాశాలు తగ్గాయని కొందరు అభిమానులు భావిస్తున్నారు.