Murari : విపరీతమైన జ్వరంను కూడా లెక్కచేయని మహేష్.. నీళ్లలోనే ఆ సాంగ్, ఫైట్ షూటింగ్ చేసిన సూపర్ స్టార్

|

Aug 09, 2024 | 12:34 PM

సోషల్ మీడియాలో అభిమానులు మహేష్ కు బర్త్ డే విషెస్ తెలుపుతుంటే మరోవైపు థియేటర్స్‌లో సూపర్ హిట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మురారి సందడి చేస్తోంది. కృష్ణ వంశీ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఎంతో పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం.. ఫ్యామిలీ ఆడియన్స్ ను ఈ సినిమా విపరీతంగా ఆకట్టుకుంది. ఈ సినిమాలో మహేష్ బాబు తన అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నాడు.

Murari : విపరీతమైన జ్వరంను కూడా లెక్కచేయని మహేష్.. నీళ్లలోనే ఆ సాంగ్, ఫైట్ షూటింగ్ చేసిన సూపర్ స్టార్
Mahesh Babu
Follow us on

సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టిన రోజు నేడు.. ఆయన పుట్టిన రోజు సందర్భంగా సోషల్ మీడియాలో అభిమానులు భారీగా సందడి చేస్తున్నారు. సోషల్ మీడియాలో అభిమానులు మహేష్ కు బర్త్ డే విషెస్ తెలుపుతుంటే మరోవైపు థియేటర్స్‌లో సూపర్ హిట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మురారి సందడి చేస్తోంది. కృష్ణ వంశీ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఎంతో పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం.. ఫ్యామిలీ ఆడియన్స్ ను ఈ సినిమా విపరీతంగా ఆకట్టుకుంది. ఈ సినిమాలో మహేష్ బాబు తన అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నాడు. అలాగే ఈ సినిమాలో సోనాలి బింద్రే హీరోయిన్ గా నటించింది. ఇక ఈ మూవీ రీ రిలీజ్ లో ఫ్యాన్స్ సందడి చేస్తున్నారు. కాగా మురారి థియేటర్ లో ఓ ఫ్యాన్ జంట పెళ్లి కూడా చేసుకున్నారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.

అలాగే పలు థియేటర్స్ లో అభిమానులు అక్షింతలు కూడా పంచుకుంటూ సినిమాలో పెళ్లి సీన్ రాగానే అక్షింతలు కూడా చల్లారు. ఇదిలా ఉంటే మురారి సినిమాలో మహేష్ బాబు ఓ ఫైట్ సీక్వెన్స్ కోసం చాలా కష్టపడరట.. ఆరోగ్యం బాలేకున్నా సినిమా కోసం షూటింగ్ లో పాల్గొన్నారట మహేష్. ఈ విషయాన్నీ దర్శకుడు కృష్ణవంశీ పలు సందర్భాల్లో చెప్పారు. ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. మురారి సినిమా జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.

మురారి సినిమాలో ఫస్ట్ ఫైట్ సీన్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. సినిమాలో మహేష్ కు ఇష్టమైన ఏనుగును రవిబాబు కిడ్నప్ చేసే సీన్ ఉంటుంది. ఆ ఏనుగును కాపాడే ప్రయత్నంలో విలన్స్ తో మహేష్ ఫైట్ చేస్తాడు. గోదావరి నీటిలో ఈ ఫైట్ సీన్ ఉంటుంది. అయితే ఆ ఫైట్ సీక్వెన్స్ చేసే సమయంలో మహేష్ కు తీవ్ర జ్వరం . అంత  జ్వరంతో ఉన్నా కూడా మహేష్ ఆ ఫైట్ సీక్వెన్స్ చేసాడట.. అయితే ఈ ఫైట్ కు ముందు ఓ సాంగ్ కూడా ఉంటుంది. ఈ సాంగ్ కూడా నీళ్లలోనే ఉంటుంది. జ్వరాన్ని సైతం లెక్కచేయకుండా నిర్మాతకు నష్టం రాకూడదని మహేష్ ఆ షూటింగ్ చేశారట. మహేష్  డెడికేషన్ కు ఈ ఒక్క ఉదాహరణ చాలు అంటున్నారు ఫ్యాన్స్. ఇదే కాదు మహేష్ బాబు తన సినిమాల్లో చాలా సాహసాలు కూడా చేశారు. అందుకే ఆయనను డైరెక్టర్ హీరో అంటుంటారు.

మురారి రీరిలీజ్ హంగామా..

 

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..