
బాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రణవీర్ సింగ్ ఇప్పుడు ‘ధురందర్’ సినిమా విజయానందంలో ఉన్నారు . అదే సమయంలో ‘డాన్ 3’ సినిమా కాంట్రవర్సీతోనూ వార్తల్లో నిలుస్తున్నాడు రణ్‌వీర్ సింగ్. ఈ సినిమా మేకింగ్ విషయంలో దర్శకుడు ఫర్హాన్ అక్తర్, రణవీర్‌ల మధ్య మనస్పర్థలు వచ్చాయని బాలీవుడ్‌లో వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వివాదాలు, పుకార్లన్నింటి మధ్య, రణవీర్ సింగ్ తన సరికొత్త లగ్జరీ కారులో ముంబై రోడ్లపై చక్కర్లు కొట్టాడు. ఖరీదైన కార్లకు సేకరణకు మారుపేరైన రణవీర్ సింగ్ తాజాగా జెట్ బ్లాక్ ఫెరారీ 296 GTB సూపర్‌కార్‌ను నడుపుతున్న వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. బాలీవుడ్‌లో అత్యంత ధనవండతుడైన హీరోల్లో ఒకరైన రణవీర్ సింగ్‌కు కార్లంటే విపరీతమైన ఇష్టం. కొత్త ఫెరారీ మాత్రమే కాకుండా, అతని గ్యారేజీలో కోట్ల రూపాయల విలువైన ఇతర కార్లు చాలానే ఉన్నాయి. మెర్సిడెస్-మేబ్యాక్ GLS 600: దీని ధర సుమారు రూ. 3.11 కోట్ల నుంచి రూ. 3.35 కోట్ల వరకు ఉంటుంది. అలాగే ఆస్టన్ మార్టిన్ రాపిడ్ ఎస్: దీని ధర సుమారుగా రూ. 3.29 కోట్ల వరకు ఉండొచ్చు. ఇక లంబోర్ఘిని ఉరస్ పెర్ల్ క్యాప్సూల్: దీని ధర సుమారు రూ. 3.98 కోట్ల నుంచి రూ. 4.71 కోట్ల వరకు ఉంటుంది.ఇక రణవీర్ సింగ్ కొత్త కారు ఫెరారీ 296 GTB. ఈ లగ్జరీ స్పోర్ట్స్ కారు ధర ఇండియాలో రూ. 6.36 కోట్లుగా ఉంది.
వివాదాస్పద చిత్రం ‘డాన్ 3’ కారణంగా రణ్‌వీర్ వార్తల్లో నిలిచాడు. ‘ధురందర్’ విజయం తర్వాత, నటుడు రణ్‌వీర్ ఫర్హాన్ అక్తర్ చిత్రం నుంచి అకస్మాత్తుగా తప్పుకున్నాడు. నివేదికల ప్రకారం, మూడు వారాల్లో సినిమా షూటింగ్ ప్రారంభం కానున్న తరుణంలో అతను అకస్మాత్తుగా చిత్రం నుంచి తప్పుకుని వివాదంలో చిక్కుకున్నాడు రణ్ వీర్. నిర్మాతల ప్రకారం, నటుడు రణ్‌వీర్ సింగ్ సినిమా నుండి ఆకస్మికంగా తప్పుకోవడం వల్ల కంపెనీకి రూ. 45 కోట్ల నష్టం వాటిల్లింది. ఈ నష్టాన్ని రణ్‌వీర్ చెల్లించాల్సి ఉంటుంది. దీనిపై ఫర్హాన్, ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్ ఇండియా ఎంప్లాయీస్ (FWICE)కు ఫిర్యాదు చేశాడు. ఈ వివాదం ఇంకా పరిష్కారం కాలేదు.
ఇక ‘ధురందర్’ విజయం తర్వాత రణవీర్ సింగ్ ప్రస్తుతం వరుస చిత్రాలతో బిజీగా ఉన్నాడు. ప్రముఖ చిత్రనిర్మాత హన్సల్ మెహతా కుమారుడైన జై మెహతా దర్శకత్వంలో తెరకెక్కుతున్న జాంబీ థ్రిల్లర్ ‘ప్రళయ’లో రణ్ వీర్ నటిస్తున్నాడు. దీంతో పాటు మరికొన్ని సినిమాలు కూడా ఈ స్టార్ హీరో చేతిలో ఉన్నాయి.
Ranveer Singh in his new car a Ferrari pic.twitter.com/J42fvFqE7z
— σ (@ranveersrebel) June 14, 2026
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి