Dhanush : కోలీవుడ్ హీరో- టాలీవుడ్ డైరెక్టర్ సినిమాకు ఇంట్రస్టింగ్ టైటిల్.. ధనుష్ నెక్స్ట్ మూవీ..

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ ఇప్పుడు తెలుగు దర్శకుల పై మొగ్గుచూపుతున్నాడు. ధనుష్ నటించిన సినిమాలు తెలుగులో కూడా విడుదలై మంచి విజయాలను అందుకుంటున్న విషయం తెలిసిందే.

Dhanush : కోలీవుడ్ హీరో- టాలీవుడ్ డైరెక్టర్ సినిమాకు ఇంట్రస్టింగ్ టైటిల్.. ధనుష్ నెక్స్ట్ మూవీ..
Danush

Updated on: Dec 23, 2021 | 10:44 AM

Dhanush: కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ ఇప్పుడు తెలుగు దర్శకుల పై మొగ్గుచూపుతున్నాడు. ధనుష్ నటించిన సినిమాలు తెలుగులో కూడా విడుదలై మంచి విజయాలను అందుకుంటున్న విషయం తెలిసిందే. ఇక ఈ వర్సటైల్ యాక్టర్ బాలీవుడ్ లోనూ సినిమాలు చేస్తున్నాడు. అత్రంగి రే అనే టైటిల్ తో తెరకెక్కిన ఈ సినిమా త్వరలోనే ఓటీటీ వేదికగా విడుదల కానుంది. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ సారా అలీఖాన్ హీరోయిన్ గా నటిస్తుండగా.. అక్షయ్ కుమార్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇదిలా ఉంటే ధనుష్ ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ తెలుగు దర్శకులతో సినిమాలు చేస్తున్నాడు. ముందుగా యంగ్ దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. ఆతర్వాత సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు.

‘తొలిప్రేమ’, ‘మిస్టర్‌ మజ్ఞు’, ‘రంగ్‌దే’లాంటి విభిన్న ప్రేమకథ చిత్రాలను తెరకెక్కించిన వెంకీ అట్లూరి దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. తాజాగా వెంకీ అట్లూరి సినిమా టైటిల్ ను విడుదల చేశారు. ఈ సినిమాకు ‘సార్’ అనే ఇంట్రస్టింగ్ టైటిల్ ను ఖరారు చేశారు. ఈ మేరకు టైటిల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. టైటిల్ ను బట్టి చూస్తుంటే ఈ సినిమాలో ధనుష్ టీచర్ గా కనిపించనున్నాడని తెలుస్తుంది. ఈ సినిమాకు జీవీ ప్రకాష్ మ్యూజిక్ అందించనున్నాడు. ఈ సినిమాలో సంయుక్తమీనన్ హీరోయిన్ గా నటిస్తున్నారు.  కాగా ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై నారాయణదాస్‌ నారంగ్, పుస్కూరు రామ్మోహన్‌ రావు నిర్మించనున్నారు. తెలుగు, తమిళ్ భాషల్లో ఈ చిత్రం తెరకెక్కనుంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Vishal: సామాన్యుడుగా రానున్న విశాల్.. ఆకట్టుకుంటున్న నుంచి థీమ్ మ్యూజిక్.

Director Deva Katta: నా సినిమాలో ప్రతి మాట.. ప్రతి సన్నివేశం ప్రతి ఆడియెన్స్‌ చర్చించే విషయమే: దేవాకట్టా

Anasuya: పార్ట్ వన్‌లో డోస్ సరిపోలేదు.. రెండో పార్ట్‌లో ఆడుకుంటా.. : అనసూయ