Devi Sri Prasad : ‘పుష్ప 2’ పనుల్లో బిజీగా రాక్ స్టార్.. అదిరిపోయే పాటలను రెడీ చేస్తున్న దేవీశ్రీ

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప సంచలన విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే.. మొదటి పాన్ ఇండియా సినిమాతోనే భారీ బ్లాక్ బస్టర్ ను సొంతం చేసుకున్నాడు బన్నీ.

Devi Sri Prasad : 'పుష్ప 2' పనుల్లో బిజీగా రాక్ స్టార్.. అదిరిపోయే పాటలను రెడీ చేస్తున్న దేవీశ్రీ
Pushpa 2
Follow us

|

Updated on: Apr 05, 2022 | 9:55 AM

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప(Pushpa) సంచలన విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే.. మొదటి పాన్ ఇండియా సినిమాతోనే భారీ బ్లాక్ బస్టర్ ను సొంతం చేసుకున్నాడు బన్నీ. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా విడుదలైన అన్ని భాషల్లో మంచి విజయాన్ని అందుకుంది. ఎర్ర చందనము స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో బన్నీ మునుపెన్నడూ కనిపించని ఊర మాస్ లుక్ లో కనిపించి ఆకట్టుకున్నారు. బన్నీ తన నటనతో బడీ లాంగ్వేజ్ తో మరోసారి ప్రేక్షకులను ఫిదా చేశారు. రష్మిక మందన్న హీరోయిన్ గా నటించిన ఈ సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఫస్ట్ పార్ట్ భారీ విజయం సాధించడంతో రెండో పార్ట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అల్లు అర్జున్ ఫ్యాన్స్. పుష్ప సినిమాలో చాలా హైలెట్స్ ఉన్నాయి. అందులో రాక్ స్టార్ దేవీశ్రీ ప్రసాద్ అందించిన సంగీతం కూడా ఒకటి.

ఈ సినిమాలో అన్ని పాటలు సూపర్ హిట్ అయ్యాయి. ఈ సినిమాలోని పాటలకు విదేశాల్లోనూ మంచి క్రేజ్ వచ్చింది. ఇక ఇప్పుడు పుష్ప 2 కోసం రంగంలోని దిగ్గాడు దేవీశ్రీ. `పుష్ప- ది రూల్` కోసం ఏకంగా మూడు పాటలకు బాణీలని పూర్తి చేసినట్టుగా తెలుస్తుంది. అయితే ఈ పాటలను పుష్ప పార్ట్ వన్ అప్పుడే రెడీ చేశారట దేవీ. ముందుగా ఈ సినిమాను ఒకే పార్ట్ అనుకున్నారట అందుకని పాటలను రెడీ చేసి పెట్టారట.. కానీ ఇప్పుడు రెండు పార్ట్ లుగా సినిమా రానుండటం తో ఆ పాటలకు మెరుగులు దిద్దే పనిలో పడ్డారట దేవీ. త్వరలోనే షూటింగ్ ని ప్రారంభించబోతున్న నేపథ్యంలో `పుష్ప 2`కు సంబంధించిన మరిన్ని పాటల్ని దేవి శ్రీప్రసాద్ పూర్తి చేయనున్నారట దేవీ. `పుష్ప 2`ని కేరళ అడవుల్లో తెరకెక్కించడానికి ఏర్పాట్లు చేస్తున్నారట సుకుమార్ అండ్ టీమ్. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియనున్నాయి.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Viral Photo: చక్కనైన కళ్లు.. బూరెబుగ్గలు.. ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా.. ఇప్పుడు యూత్ ఐకాన్..

Arabic Kuthu: యూట్యూబ్‏ను షేక్ చేస్తోన్న ‘అరబిక్ కుతు’ సాంగ్ తెలుగు వెర్షన్.. ఇంతకీ మీరూ విన్నారా ?..

Sarkaru Vaari Paata: మహేష్ బాబు ఫ్యాన్స్‏కు మళ్లి నిరాశేనా !.. సర్కారు వారి పాట వాయిదా ?.. ఇప్పుడిదే హాట్ టాపిక్..