AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: నేను నపుంసకుడిని అని నా అన్నే నాకు విషం పెట్టి చంపాలనకున్నాడు…

డ్యాన్స్ మాస్టర్ అనిల్ రాజు తన జీవిత ప్రయాణం, కుటుంబ సంబంధాలు, ఆధ్యాత్మిక మార్పు గురించి లోతుగా పంచుకున్నారు. తన అన్నయ్య ఆనందరాజ్ పేరుతో జరిగిన విషప్రయోగ ప్రయత్నం, ఆర్థిక ఇబ్బందులు, తల్లిలేని లోటు వంటి కష్టాలను ఎదుర్కొని ముందుకు సాగినట్లు తెలిపారు.

Tollywood: నేను నపుంసకుడిని అని నా అన్నే నాకు విషం పెట్టి చంపాలనకున్నాడు...
Anil Raju - Anand Raju
Ram Naramaneni
|

Updated on: Mar 23, 2026 | 8:33 AM

Share

డ్యాన్స్ మాస్టర్ అనిల్ రాజు తన అన్నయ్య, ప్రముఖ నటుడు ఆనందరాజ్‌తో తన సంబంధం, అలాగే తన వ్యక్తిగత జీవితంలోని చీకటి కోణాలు, అద్భుతమైన మార్పు గురించి ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పంచుకున్న విషయాలు అందరినీ ఆశ్చర్యపరిచాయి. ఆయన తల్లి లేని లోటు, గతంలో ఎదుర్కొన్న ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ సభ్యుల నుంచి విషాదకరమైన సంఘటనలు, తాజా ఆధ్యాత్మిక ప్రయాణం గురించి వివరంగా వెల్లడించారు. అనిల్ రాజు తన తల్లి ప్రార్థనల ప్రభావం వల్ల మనస్సు మార్చుకుని, గతంలోని చెడు అలవాట్లను విడిచిపెట్టానని చెప్పారు. ప్రస్తుతం ఆయన జీవితంలో తల్లి లేని లోటు, ఆర్థికంగా ఎదురైన ఇబ్బందులు తనను ఇప్పటికీ కలచివేస్తున్నాయని తెలిపారు.

అయితే, ఆయనకు అత్యంత బాధాకరమైన విషయం ఏమిటంటే, తన అన్నయ్య (ఆనందరాజ్) పేరుతో, కుటుంబ సభ్యులు తనను పాలల్లో విషం కలిపి చంపేయాలని ప్రయత్నించారని ఆయన సంచలన ఆరోపణ చేశారు.  తాను చీర కట్టుకోవడం, ఖరీదైన బంగారం ధరించడం వంటి విషయాలు కుటుంబ సభ్యులకు “అవమానం”గా అనిపించాయని, దీని కారణంగానే ఈ ప్రయత్నం జరిగిందని అనిల్ రాజు పేర్కొన్నారు. “మీ అమ్మ పెద్ద సింగర్‌వి, అన్నయ్య యాక్టర్, ఇది మాకు అవమానం” అని కుటుంబ సభ్యులు వ్యాఖ్యానించినట్లు ఆయన గుర్తు చేసుకున్నారు. ఈ విషాద సంఘటన తర్వాత తాను బొంబాయికి వెళ్ళిపోయానని, ఆ తర్వాత జీసస్‌ని నమ్ముకున్నాక తన జీవితంలో ఒక బలమైన మార్పు వచ్చిందని వివరించారు. గతంలో తాను “పిచ్చి పిచ్చిగా” బతికానని, దీనివల్ల కోటి రూపాయల వరకు నష్టపోయానని అనిల్ రాజు అంగీకరించారు. అయితే, ఇప్పుడు తన వద్ద లక్షల విలువైన వాచ్, తల్లి సంపాదించిన 3 కిలోల బంగారం, కారు, అలాగే బెంగళూరులో ఒక ఇల్లు వంటి ఆస్తులు ఉన్నాయని చెప్పారు.

తన తల్లి గొప్ప గాయని అని, రాజ్ కుమార్, లతా మంగేష్కర్, ఎ.ఎం. రాజా వంటి దిగ్గజాలతో కలిసి పాడిందని, అందుకే కన్నడ ప్రభుత్వం ఆమెకు బెంగళూరులో ఇల్లును బహుమతిగా ఇచ్చిందని తెలిపారు. తన తల్లి తన ఆస్తిని కొడుకులందరికీ పంచి ఇచ్చిందని, తనకు కూడా బాగా చూసుకుందని చెప్పారు. తన వయసు 65 సంవత్సరాలని, షుగర్, బీపీ వంటి ఆరోగ్య సమస్యలు లేవని అనిల్ రాజు పేర్కొన్నారు. డ్యాన్స్ మాస్టర్‌గా తన వృత్తిపరమైన జీవితం గురించి మాట్లాడుతూ, ప్రభాస్ పౌర్ణమి సినిమాకు పనిచేశానని, శివశంకర్ మాస్టర్ తన గురువు అని తెలిపారు. డబ్బు విషయంలో తాను చాలా కఠినంగా ఉంటానని, షూటింగ్‌కి వెళ్లే ముందు సగం డబ్బు ముందుగానే తీసుకోవాలని, మిగిలిన సగం మేకప్ వేసుకున్నాక ఇవ్వాలని డిమాండ్ చేస్తానని వివరించారు. తన దుస్తులు, అలంకరణ గురించి చెబుతూ, ఎప్పుడూ బంగారు నగలు ధరించి, లిప్‌స్టిక్, ఐబ్రోలతో సిద్ధంగా ఉంటానని, రాఘవేంద్ర రావు కూడా నగలు ధరించినవారినే ఇష్టపడతారని చమత్కరించారు. “రాను రాను చిన్నది” అనే పాటలో నటించానని, సుమన్ శెట్టిని తన మీదకు తోసే సన్నివేశం “జయం” సినిమాలో ఉందని గుర్తు చేసుకున్నారు.

ట్రాన్స్‌జెండర్ వ్యక్తిగా సమాజంలో ఎదురయ్యే చిన్నచూపు గురించి ప్రస్తావిస్తూ, కొందరు ప్రేమించి, ఆశీర్వదిస్తే బాగుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తనను ఒక కొడుకులా చూసుకునే నరసింహ అనే యువకుడు బెంగళూరులో ఉన్నాడని, అతడు కూడా డ్యాన్స్ మాస్టర్ అని, తల్లిదండ్రులు లేని ఆ అబ్బాయి తనను చాలా బాగా చూసుకుంటాడని, తన తర్వాత తరాన్ని అతడే చూసుకుంటాడని భావోద్వేగంగా చెప్పారు. తన జీవితంలో ఏ ఆర్థిక ఇబ్బందులు లేవని, అన్నిటికీ కారులో ప్రయాణిస్తానని, బస్సులో మాత్రం ప్రయాణించనని స్పష్టం చేశారు. ఆధ్యాత్మికంగా, ఆర్థికంగా స్థిరపడిన అనిల్ రాజు జీవిత ప్రయాణం ఎందరికో స్ఫూర్తినిచ్చే అంశం.

Also Read: ప్రభాస్ హీరో అవ్వకముందే నాకు తెల్సు.. స్టార్ అయ్యాక కలవడానికి వెళ్తే.. ఆయన చేసిన పనికి.. 

Follow Us