Mangalavaaram: మంగళవారం సీక్వెల్ పై క్రేజీ అప్డేట్.. ఈసారి మరింత థ్రిల్లింగ్‌గా

ఆర్‌ఎక్స్‌ 100 డైరెక్టర్‌ అజయ్‌ భూపతి తెరకెక్కించిన మంగళవారం సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఆకట్టుకునే కథా కథనాలు, గ్రిప్పింగ్‌ స్క్రీన్ ప్లే మంగళవారం సినిమా నిర్మాతలకు కాసుల పంట పండించింది. అన్నిటికీ మించి ఆర్‌ ఎక్స్ 100 తర్వాత ఆ స్థాయి విజయం లేని పాయల్‌ రాజ్‌పుత్‌, డైరెక్టర్‌ అజయ్‌ భూపతిలకు ఒక మంచి సాలిడ్‌ సక్సెస్‌ ఇచ్చింది మంగళవారం సినిమా.

Mangalavaaram: మంగళవారం సీక్వెల్ పై క్రేజీ అప్డేట్.. ఈసారి మరింత థ్రిల్లింగ్‌గా
Mangalavaram

Updated on: Feb 05, 2025 | 8:40 PM

అజయ్ భూపతి దర్శకత్వంలో వచ్చిన మంగళవారం సినిమా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఆర్ఎక్స్ 100 సినిమా తర్వాత పాయల్ రాజ్ పుత్ తో కలిసి తెరకెక్కిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. అజయ్ భూపతి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఎక్స్ 100 సినిమాతో పాయల్ రాజ్ పుత్ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. తొలి సినిమాలోనే బోల్డ్‌గా నటించి మెప్పించింది పాయల్. రొమాంటిక్స్ సీన్స్ లోనూ రెచ్చిపోయి నటించింది. అలాగే మంగళవారం కూడా బోల్డ్ కంటెంట్ తో తెరకెక్కింది. ఈ సినిమాలోనూ పాయల్ మరోసారి తన బోల్డ్ యాక్టింగ్‌తో కట్టిపడేసింది. మంగళవారం సినిమా సూపర్ హిట్‌తో కావడంతో పాయల్‌కు మంచి క్రేజ్ వచ్చింది.

ఈ సినిమా తర్వాత అజయ్ భూపతి కొత్త సినిమాను అనౌన్స్ చేయలేదు. పాయల్ కూడా పెద్దగా సినిమాలను అనౌన్స్ చేయలేదు. ఇదిలా ఉంటే ఇప్పుడు మంగళవారం సినిమాకు సీక్వెల్ తెరకెక్కనుందని తెలుస్తుంది. అజయ్ భూపతీ ఇప్పుడు మంగళవారం సినిమాకు సీక్వెల్ తెరకెక్కించే పనిలో ఉన్నారని తెలుస్తుంది. అయితే ఈ సినిమాలో ఎవరు నటించనున్నారు. ఈసారి ఎలాంటి కాన్సెప్ట్ తో సినిమా ఆ ఉంటుంది అనే ఆసక్తికర చర్చ జరుగుతుంది.

మంగళవారం సినిమాకు సీక్వెల్ ఉంటుందని గతంలోనే మేకర్స్ కన్ఫర్మ్ చేశారు. అయితే ఈ సినిమా కోసం అజయ్ భూపతి మరో ఆసక్తికర కథను రెడీ చేస్తున్నారు. ఈసారి మరింత థ్రిల్లింగ్ గా ఉండేలా కథను సిద్ధం చేస్తున్నాడని తెలుస్తుంది. అయితే ఈ సినిమాలో పాయల్ హీరోయిన్ గా చేయడం లేదు అని తెలుస్తుంది. మరో హీరోయిన్ తో సినిమా చేయాలనీ చూస్తున్నారట. త్వరలోనే దీని పై క్లారిటీ రానుంది. మంగళవారం సినిమా సీక్వెల్ రెడీ అవుతుందని తెలిసి అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి