
‘కలర్స్’ స్వాతిగా గుర్తింపు తెచ్చుకున్నటాలీవుడ్ హీరోయిన్ మళ్లీ పెళ్లి చేసుకుంది. అది కూడా ఓ టాలీవుడ్ దర్శకుడినే కావడం విశేషం. తన పెళ్లికి సంబంధించిన ఫొటోలని స్వాతినే స్వయంగా సోషల్ మీడియాలో షేర్ చేసింది. పెళ్లి దుస్తుల్లో భర్తతో కలిసున్న ఫొటోను ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేస్తూ ‘పెళ్లి చేసుకున్నాం’ అని క్యాప్షన్ ఇచ్చింది. ఈ పోస్ట్ కు తన భర్త ఇన్ స్టా గ్రామ్ అకౌంట్ ను కూడా ట్యాగ్ చేసింది. ప్రస్తుతం ఈ ఫొటోస్ సోషల్ మీడియాతో పాటు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారిపోయాయి. ఇంతకీ స్వాతి పెళ్లి చేసుకున్నది మరెవరినో కాదు ప్రముఖ దర్శకుడు శ్రీకాంత్ నాగోతి. స్వాతి ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘మంత్ ఆఫ్ మధు’ మూవీకి శ్రీకాంతే దర్శకుడు. అయితే వీరు ఎప్పుడు ప్రేమలో పడ్డారో తెలియదు కానీ బుధవారం(జూలై 08) ఇద్దరూ పెళ్లిపీటలెక్కారు. ఇంట్లోనే సింపుల్‌గా ఈ వేడుక జరిగినట్లు ఈమె పోస్ట్ చేసిన ఫొటోల బట్టి అర్థమవుతోంది. కాగా ఈ ఫొటోలను చూసి పలువరు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు స్వాతి-శ్రీకాంత్ దంపతులకు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
కాగా స్వాతికి ఇది రెండో వివాహం. 2018లో ఆమె వికాస్ వాసు అనే పైలెట్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. అయితే ఏమైందో తెలియదు కానీ కొద్ది కాలానికే ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయి. ఇద్దరూ విడిపోయారు. అయితే వీళ్లిద్దరూ విడాకులు తీసుకున్న విషయం బయటకు రాలేదు. స్వాతి కూడా ఈ విషయంపై మాట్లాడడానికి ఇష్టపడలేదు. అయితే ఇప్పుడు మాత్రం మళ్లీ పెళ్లి చేసుకుని అందరికీ షాక్ ఇచ్చింది అందాల తార.
కాగా ‘కలర్స్’ అనే టీవీ కార్యక్రమంతో యాంకర్‌గా తెలుగు వెండితెర ప్రేక్షకులకు పరిచయం అయింది. ఈ షో సక్సెస్ కావడంతో ఆమెకు ‘కలర్స్ స్వాతి’ అనే పేరు స్థిరపడిపోయింది. ఈ ఫేమ్ తోనే ‘డేంజర్’ అనే సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ లో అడుగుపెట్టింది. ‘అష్టాచమ్మా’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత . తర్వాత ‘స్వామి రారా’, ‘గోల్కొండ హైస్కూల్’, ‘కార్తికేయ’, ‘పంచతంత్రం’, ‘అప్పల్రాజు’ తదితర సినిమాల్లో నటించి మెప్పించింది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి