కమర్షియల్ ప్రకటనల విషయంలో సినీ నటుడు మహేశ్ బాబు జోరు కొనసాగిస్తున్నాడు. ఈయనతో తమ బ్రాండ్ ను ప్రమోట్ చేయించుకోవడానికి కార్పొరేట్ కంపెనీలూ పోటీ పడుతున్నాయి. ఫలితంగా ప్రకటనల రెమ్యూనరేషన్ విషయంలో తగ్గేదేలే అంటున్నాడు మహేశ్. అయితే ఆయన అడిగినంత డబ్బు ఇచ్చేందుకు కంపెనీలు వెనుకడుగు వేయకపోవడం గమనార్హం. మహేశ్ బాబు ఇప్పటికే దాదాపు డజనుకు పైగా బ్రాండ్స్ ఎండోర్స్ చేస్తున్నాడు. అందులో ఒక్కో దానికి ఒక్కోలా పారితోషికం తీసుకుంటున్నాడు. తాజాగా మౌంటెన్ డ్యూ యాడ్ కోసం భారీ పారితోషికం అందుకున్నట్లు తెలుస్తోంది.
ఈ ప్రకటనను దుబాయ్‌లోని అత్యంత ప్రతిష్టాత్మక బుర్జ్ ఖలీఫా దగ్గర షూట్ చేశారు. హిందీలో ఈ యాడ్ హృతిక్ రోషన్ చేశాడు. తెలుగులో ఏడాది పాటు మౌంటెన్ డ్యూ సాఫ్ట్ డ్రింక్ ప్రమోట్ చేయడానికి మహేశ్ ఏకంగా 12 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు సమాచారం. గత ఏడాది కూడా ఈ బ్రాండ్ ఆయనే ప్రమోట్ చేశాడు. అప్పుడు 7 కోట్లు తీసుకున్న మహేశ్.. ఈ సారి 5 కోట్లు అధికంగా తీసుకున్నాడు. దీంతో పాటు సోషల్ మీడియాలోనూ మౌంటెన్ డ్యూ కంపెనీకి సంబంధించిన బ్రాండ్ ను మహేశ్ ప్రమోట్ చేయాల్సి ఉంటుంది. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని 12 కోట్ల రెమ్యునరేషన్ ను మహేశ్ అందుకున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. మహేశ్ ప్రస్తుతం సర్కారు వారి పాట చిత్రంతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా మే 13న విడుదల కానుంది.
Also Read
PPF vs NPS investment: ఉద్యోగ విరమణ నిధికోసం ఎందులో పెట్టుబడి పెడితే లాభం.. పీపీఎఫ్? ఎన్ పీఎస్?