Tollywood : బుల్లిరాజు అంటే మాములుగా ఉండదు మరి.. చైల్డ్ ఆర్టిస్ట్ రేవంత్ రెమ్యునరేషన్ ఎంతంటే…

సాధారణంగా సినీరంగంలో ఎప్పుడు ఎవరి అదృష్టం వరిస్తుందో చెప్పడం కష్టమే. ఒక్కోసారి చిన్న చిన్న పాత్రలు పోషించిన నటీనటులు, చైల్డ్ ఆర్టిస్టులు ఎక్కువగా పాపులర్ అవుతుంటారు. అలాంటి వారిలో బుల్లిరాజు అలియాస్ రేవంత్ ఒకరు. సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో వెంకటేష్ తనయుడిగా నటించి ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు. ఇందులో బుల్లిరాజు యాక్టింగ్ ప్రేక్షకులను ఆకట్టుకుంది.

Tollywood : బుల్లిరాజు అంటే మాములుగా ఉండదు మరి..  చైల్డ్ ఆర్టిస్ట్ రేవంత్ రెమ్యునరేషన్ ఎంతంటే...
Bulli Raju

Updated on: Jun 29, 2026 | 12:41 PM

సినిమా ఇండస్ట్రీలో ఒక్కోసారి స్టార్ హీరో, హీరోయిన్ల కంటే కూడా చిన్న పాత్రలు చేసే చైల్డ్ ఆర్టిస్టులే ఆడియన్స్‌కు బాగా కనెక్ట్ అయిపోతుంటారు. తమ క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్, అమాయకత్వంతో సినిమా విజయాల్లో కీలక పాత్ర పోషిస్తారు. అలాగే కొన్నిసార్లు చైల్డ్ ఆర్టిస్టులు సైతం పాపులర్ అవుతుంటారు. అలా అతి తక్కువ సమయంలోనే టాలీవుడ్‌లో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకున్నాడు బాలనటుడు బుల్లిరాజు అలియాస్ మాస్టర్ రేవంత్. విక్టరీ వెంకటేష్ హీరోగా, దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వచ్చిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రంలో వెంకటేష్ కొడుకుగా ‘బుల్లి రాజు’ పాత్రలో నటించి తెలుగు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాడు. తన కామెడీ టైమింగ్, సహజమైన నటనతో ఈ బుడ్డోడు రాత్రికి రాత్రే స్టార్ అయిపోయాడు. ఈ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో ఓవర్ నైట్ సెన్సేషన్ అయ్యాడు. దీంతో అతడికి తెలుగులో ఆఫర్స్ క్యూ కట్టాయి.

ఎక్కువమంది చదివినవి : Cinema: 5 ఏళ్లుగా తగ్గని డిమాండ్.. సోషల్ మీడియాలో ట్రెండింగ్ మూవీ.. ఓటీటీలో గత్తరలేపుతుంది..

ప్రస్తుతం టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ చైల్డ్ ఆర్టిస్ట్‌గా మారిన రేవంత్ రెమ్యూనరేషన్ ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా నిలిచింది. ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం, రేవంత్ రోజుకు దాదాపు ఒక లక్ష రూపాయల వరకు పారితోషికం అందుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. అంతేకాదు, సినిమా , మరియు పాత్ర ప్రాధాన్యతను బట్టి ఒక్కో ప్రాజెక్ట్‌కు రూ. 50 లక్షల నుండి రూ. 75 లక్షల వరకు డిమాండ్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. అయితే, ఈ వార్తలపై రేవంత్ కుటుంబ సభ్యులు కానీ, నిర్మాతలు కానీ అధికారికంగా స్పందించలేదు.

ఎక్కువమంది చదివినవి : Tollywood : ఉదయ్ కిరణ్‏తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్.. ఎంతో నరకం అనుభవించాను.. టాలీవుడ్ హీరోయిన్..

ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరు జిల్లా చానమిల్లి గ్రామానికి చెందిన రేవంత్ ప్రస్తుతం ఆరో తరగతి చదువుతున్నాడు. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఒక వీడియో ద్వారా అతని ప్రతిభను గుర్తించిన అనిల్ రావిపూడి ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాలో గోల్డెన్ ఛాన్స్ ఇచ్చారు. ఆ ఒక్క సినిమా రేవంత్ లైఫ్‌ను మార్చేసింది. ఇప్పటికే ఈ బుడ్డోడు ‘మన శంకరవరప్రసాద్’, ‘అనగనగా ఒక రాజు’, ‘సింగిల్’ వంటి వరుస ప్రాజెక్టులతో వెండితెరపై సందడి చేశాడు. సినిమాలే కాకుండా టీవీ షోలు, బ్రాండ్ ఎండార్స్‌మెంట్లు, మాల్స్ ఓపెనింగ్స్‌తో బుల్లి రాజు హవా గట్టిగానే నడుస్తుంది.

ఎక్కువమంది చదివినవి : RRR Movie : అబ్బబ్బా.. ఏం మారింది భయ్యా.. ఆర్ఆర్ఆర్ సినిమా మల్లీని చూశారా.. ? అచ్చం హీరోయిన్‏లాగే ఉందిగా..

 

ఎక్కువమంది చదివినవి : Tollywood : ఖుష్బూ కూతురి పెళ్లిలో చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ సందడి.. స్పెషల్ అట్రాక్షన్‏గా త్రిష.. వీడియోస్ ఇదిగో..

Follow Us