
సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ పై ఇప్పటికే చాలా మంది హీరోయిన్స్ మీడియా ముందుకు వచ్చి తమ చేదు అనుభవాలను పంచుకున్నారు. క్యాస్టింగ్ కౌచ్ పై చాలా మంది హీరోయిన్స్ షాకింగ్ కామెంట్స్ చేశారు. తాజాగా ఓ నటి షాకింగ్ కామెంట్స్ చేసింది. ఆమె మరెవరో కాదు క్యారెక్టర్ ఆర్టిస్ట్ సత్య కృష్ణన్. డాలర్ డ్రీమ్స్ సినిమా ద్వారా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. మొదట్లో ఆమె హైదరాబాద్ లోని తాజ్ కృష్ణలో పని చేశారు. ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీలోకి వచ్చారు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ఆనంద్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆనంద్ సినిమాలో కీలక పాత్రలో నటించింది సత్య కృష్ణన్. సపోర్టింగ్ రోల్స్ లో నటించి మెప్పించింది సత్య. డిఫరెంట్ వాయిస్ తో డైలాగ్స్ చెప్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది సత్య. మెంటల్ కృష్ణ, ఒక్కడినే, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, బొమ్మరిల్లు లాంటి సినిమాల్లో తన నటనతో మెప్పించింది సత్య కృష్ణన్.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సత్య కృష్ణన్ మాట్లాడుతూ షాకింగ్ కామెంట్స్ చేసింది. కాస్టింగ్ కౌచ్ పై సత్య కృష్ణన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. క్యాస్టింగ్ కౌచ్ అన్ని ఇండస్ట్రీల్లో ఉంటుంది. ఇలాంటి సంఘటనలు ఎదురైనప్పుడు మహిళలు తమను తమను రక్షించుకోగలగాలి అప్పుడు అన్ని సవ్యంగా ఉంటాయి అని చెప్పుకొచ్చింది సత్య.
చాలా మంది కమిట్ మెంట్ ఇవ్వకపోతే సినిమాల్లో ఛాన్స్ లు రావు అని భయపడి లొంగిపోతున్నారు అని అన్నారు సత్య కృష్ణన్. తన కెరీర్ లో మాత్రం అలాంటి సంఘటన ఎప్పుడూ ఎదుర్కోలేదని అన్నారు సత్య కృష్ణన్. కానీ అలాంటి సంఘటనలను నేను ప్రత్యేకంగా చూశాను అని తెలిపారు సత్య కృష్ణన్. కాస్టింగ్ కౌచ్ ను ఎదురుకోవడం కొంత కష్టమే కానీ దైర్యంగా ఎదుర్కోవాలి అని తెలిపారు సత్య కృష్ణన్. ఇన్నాళ్లు పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించిన సత్యకృష్ణన్ ఇప్పుడు నిర్మాతగా మారాలని చూస్తున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.