
ప్రస్తుతం సోషల్ మీడియాలో సినీతారలకు సంబంధించిన చిన్ననాటి ఫోటోస్ తెగ వైరలవుతున్నాయి. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ ఇండస్ట్రీలకు చెందిన స్టార్స్ బాల్య జ్ఞాపకాలు చూసేందుకు..వారి పర్సనల్ విషయాలు తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. పైన ఫోటోను చూశారా.. ? అందులో కనిపిస్తున్న ఇద్దరు చిన్నారులకు అమ్మాయిల ఫాలోయింగ్ ఎక్కువే. విభిన్న ప్రయోగాత్మక చిత్రాలతో ఇండస్ట్రీలో తమకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. ఇప్పుడు హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ఆ ఇద్దరు మరెవరో కాదండి.. కోలీవుడ్ స్టార్స్ సూర్య, కార్తి. వీరిద్దరి చిన్ననాటి ఫోటోస్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.
ఇవి కూడా చదవండి : Tollywood : 19 ఏళ్ల వయసులో 31 ఏళ్ల స్టార్ హీరోతో పెళ్లి.. 11 సంవత్సరాలకు రీఎంట్రీ ఇస్తున్న హీరోయిన్..
సూర్య-కార్తీ సోదరులు సినిమా సంప్రదాయం ఉన్న కుటుంబం నుండి వచ్చారు. సూర్య, కార్తీ ప్రముఖ నటుడు శివకుమార్ కుమారులు. ఇద్దరు కుమారులు తమ తండ్రి బాటలోనే సినీరంగంలోకి అడుగుపెట్టారు. నడిగిప్పిన్ నాయక్ గా పిలువబడే సూర్య అసలు పేరు శరవణన్ సూర్య శివకుమార్. ‘నెర్క్కు నేర్’ చిత్రంతో అరంగేట్రం చేసిన సూర్య, 2001లో బాలా దర్శకత్వం వహించిన ‘నందా’ చిత్రంతో హీరోగా మారారు. ఇప్పుడు సూర్య తమిళ సినిమాల్లో తిరుగులేని స్టార్ గా మారారు.
ఇవి కూడా చదవండి : Cinema: కాంతార, కేజీఎఫ్ చిత్రాలను వెనక్కు నెట్టింది.. అప్పుడు థియేటర్లు.. ఇప్పుడు ఓటీటీని ఊపేస్తోన్న మూవీ..
సూర్య తర్వాత కార్తి సైతం తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. కార్తీ కూడా 2007లో ‘పరుత్తివీరన్’ చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్నాడు. ‘ఆయిరతిల్ ఒరువన్’, ‘పైయ్యా’, ‘నాన్ మహన్ అల్లా’, ‘సిరుత్తై’, కైది వంటి చిత్రాలతో తమిళ చిత్రసీమలో తన స్థానాన్ని ఏర్పరచుకున్నారు. ఈ ఇద్దరు అన్నదమ్ములకు తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఉంది.
ఇవి కూడా చదవండి : Actress: అప్పుడు స్కూల్లో టీచర్.. తెలుగు ఇండస్ట్రీని షేక్ చేసిన టాప్ హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టారా.. ?
ఇవి కూడా చదవండి : Actress: చిరంజీవి, బాలకృష్ణతో సూపర్ హిట్ సినిమాలు.. 55 ఏళ్ల వయసులోనూ స్టిల్ సింగల్.. ఇప్పటికీ యూత్‌లో యమ క్రేజ్..