Tollywood: అందాల వయ్యారి కుర్రాళ్ల హార్ట్ బ్రేక్ చేసిన హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టగలరా ..?

తెలుగు, హిందీ భాషలలో పలు సినిమాలు చేసి స్టార్ డమ్ సంపాదించుకున్న ఈ బ్యూటీ.. కెరీర్ మంచి ఫాంలో ఉండగానే సినిమాలకు గుడ్ బై చెప్పేసింది. పెళ్లి తర్వాత పూర్తిగా ఫ్యామిలీకే టైమ్ కేటాయించిన ఈ సుందరి.. ఎప్పటికీ తిరిగి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టనని తెలిపింది. తనకు తిరిగి సినిమాల్లో నటించాలనే ఆసక్తి కూడా లేదని చెప్పుకొచ్చింది. ఇంతకీ ఆ వయ్యారి ఎవరో గుర్తుపట్టగలరా ?..

Tollywood: అందాల వయ్యారి కుర్రాళ్ల హార్ట్ బ్రేక్ చేసిన హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టగలరా ..?
Actress 1
Follow us

|

Updated on: Apr 30, 2024 | 1:00 PM

ఈ అందాల వయ్యారి టాలీవుడ్ సెన్సెషన్. ఒకే ఒక్క సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలో సంచలనం సృష్టించింది. తొలి సినిమాతోనే తెలుగు కుర్రాళ్ల హృదయాలను దొచేసింది. తెలుగు, హిందీ భాషలలో పలు సినిమాలు చేసి స్టార్ డమ్ సంపాదించుకున్న ఈ బ్యూటీ.. కెరీర్ మంచి ఫాంలో ఉండగానే సినిమాలకు గుడ్ బై చెప్పేసింది. పెళ్లి తర్వాత పూర్తిగా ఫ్యామిలీకే టైమ్ కేటాయించిన ఈ సుందరి.. ఎప్పటికీ తిరిగి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టనని తెలిపింది. తనకు తిరిగి సినిమాల్లో నటించాలనే ఆసక్తి కూడా లేదని చెప్పుకొచ్చింది. ఇంతకీ ఆ వయ్యారి ఎవరో గుర్తుపట్టగలరా ?.. తను ఇంకెవరో కాదండి.. అక్కినేని నాగార్జున హీరోగా నటించిన సూపర్ మూవీ హీరోయిన్ అయేషా టాకీయా. చలనచిత్ర పరిశ్రమలో కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్న ఈ బ్యూటీ.. 18 ఏళ్ల వయసులోనే తెరంగేట్రం చేసింది.

కెరీర్ మొదట్లో ఫేమస్ సింగర్ ఫల్గుణి పాఠక్ రూపొందించిన సూపర్ హిట్ మ్యూజిక్ వీడియో మేరీ చునార్ ఉద్ ఉద్ జాయే పాటలో కనిపించింది. ఇందులో హీరోయిన్ త్రిషతోపాటు.. శాంటినో మోరియా నటించారు. ఈ సాంగ్ వీడియో చేస్తున్నప్పుడు అయేషా వయసు 15 సంవత్సరాలు మాత్రమే. మోడల్‌గా తన కెరీర్‌ను ప్రారంభించిన అయేషా.. మేరీ చునార్ ఉద్ద్ ఉద్ద్ జాయే పాటతో అందరి దృష్టిని ఆకర్షించింది. తర్వాత ఆమె టార్జాన్: ది వండర్ కార్‌తో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. 2004లో ఉత్తమ అరంగేట్రం కోసం ఫిల్మ్‌ఫేర్ అవార్డును గెలుచుకుంది.

దిల్ మాంగే మోర్!!!, దోర్, నో స్మోకింగ్, వాంటెడ్, సలామ్-ఇ-ఇష్క్, పాత్‌షాలా వంటి చిత్రాలలో నటించింది. తెలుగులో సూపర్ చిత్రంలో నటించి అందరి దృష్టిని ఆకర్షించింది. చివరిసారిగా 2011 చిత్రం మోడ్‌లో కనిపించింది. చాలా కాలం తర్వాత అయేషా ముంబై ఎయిర్ పోర్టులో తన కుమారుడితో కలిసి కనిపించింది. దీంతో ఆమె లుక్స్ పై ట్రోల్స్ జరిగాయి. అయితే తన పై వచ్చిన ట్రోల్స్ పై గట్టిగానే రియాక్ట్ అయ్యింది అయేషా. 15 ఏళ్ల తర్వాత కూడా అంతే అందంగా కనిపించాలంటే ఎలా అసహనం వ్యక్తం చేసింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Latest Articles
చనిపోయిన వ్యక్తుల దుస్తులు వేసుకుంటే ఏం జరుగుతుంది?
చనిపోయిన వ్యక్తుల దుస్తులు వేసుకుంటే ఏం జరుగుతుంది?
రాయ్‌బరేలీలో సోనియా గాంధీ ఉద్వేగభరిత ప్రసంగం..!
రాయ్‌బరేలీలో సోనియా గాంధీ ఉద్వేగభరిత ప్రసంగం..!
పిల్లలకు గోధుమపిండి అంటే అలెర్జీనా.. బీ అలర్ట్..
పిల్లలకు గోధుమపిండి అంటే అలెర్జీనా.. బీ అలర్ట్..
ఆహాలో సుహాస్ లేటెస్ట్ హిట్ 'ప్రసన్న వదనం.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఆహాలో సుహాస్ లేటెస్ట్ హిట్ 'ప్రసన్న వదనం.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
స్నానం చేసే బకెట్‌లో వీటిని కలపండి.. ఆ ప్రాబ్లమ్స్‌ అన్నీ మాయం!
స్నానం చేసే బకెట్‌లో వీటిని కలపండి.. ఆ ప్రాబ్లమ్స్‌ అన్నీ మాయం!
మీన రాశిలో కుజుడు..ఆ రాశుల వారికి రాజ యోగాలు.. దోషాలు కూడా!
మీన రాశిలో కుజుడు..ఆ రాశుల వారికి రాజ యోగాలు.. దోషాలు కూడా!
లక్నోతో మ్యాచ్.. టాస్ గెలిచిన ముంబై.. సచిన్ కుమారుడు వచ్చేశాడు
లక్నోతో మ్యాచ్.. టాస్ గెలిచిన ముంబై.. సచిన్ కుమారుడు వచ్చేశాడు
రోజుని మష్రూమ్ కాఫీతో ప్రారంభించండి.. ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో..
రోజుని మష్రూమ్ కాఫీతో ప్రారంభించండి.. ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో..
దోసకాయ తొక్క.. పనికిరాదని పారేయకండి.. లాభాలు తెలిస్తే అవాక్కే!
దోసకాయ తొక్క.. పనికిరాదని పారేయకండి.. లాభాలు తెలిస్తే అవాక్కే!
ఉత్తరాదిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న వింత వాతావరణం..!
ఉత్తరాదిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న వింత వాతావరణం..!