Ajith Kumar : 20 ఏళ్ల తర్వాత రీమేక్ కానున్న అజిత్ సూపర్ హిట్ సినిమా..

తమిళ్ సెన్సషనల్ స్టార్  అజిత్ కెరీర్ లో ఓ మంచి సినిమాగా నిలిచింది వాలి. హీరో కం దర్శకుడు యస్ జె సూర్య తొలి చిత్రం ఈ వాలి.

Ajith Kumar : 20 ఏళ్ల తర్వాత రీమేక్ కానున్న అజిత్ సూపర్ హిట్ సినిమా..
Ajith

Updated on: Nov 28, 2021 | 5:48 PM

Ajith Kumar : తమిళ్ సెన్సషనల్ స్టార్  అజిత్ కెరీర్ లో ఓ మంచి సినిమాగా నిలిచింది వాలి. హీరో కం దర్శకుడు యస్ జె సూర్య తొలి చిత్రం ఈ వాలి. తెలుగు తమిళ్ భాషలలో 1999 లో విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ మూవీగా సంచలన విజయం సాధించింది. అయితే ఈ చిత్రం ఇప్పటివరకు ఇతర ఇండియన్ లాంగ్వేజ్ లలో రీమేక్ కాలేదు. తెలుగు లో ప్రముఖ నిర్మాణ సంస్థ సూపర్ గుడ్ ఫిలిమ్స్ బ్యానర్ లో డబ్బింగ్ చిత్రంగా విడుదల అయ్యింది. అజిత్ ని అగ్ర హీరో గా స్టార్ డమ్ తెచ్చిన వాలి చిత్రం తమిళ్ మరియు కన్నడ మినహా అన్ని బాషల రీమేక్ రైట్స్ ని దక్కించుకున్నారు బోనీ కపూర్.

వాస్తవానికి 2020 లో దక్కించుకున్న బోనీ కపూర్ పై ఆ చిత్ర దర్శకుడు S J సూర్య కోర్ట్ లో కేసు వేయడం అదే సమయంలో కరోనా ఎంటర్ అవడంతో ఓ ఏడాది పాటు షూటింగ్ కై నిరీక్షించాల్సి వచ్చింది. ఎట్టకేలకు కోర్ట్ తీర్పు కూడా అనుకూలంగా రావడంతో ఇప్పుడు ఈ సినిమా రీమేక్ కై శ్రీకారం చుట్టనున్నారు. ఈ బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాన్ని కపూర్స్ వెంచర్ మరియు నరసింహ ఎంటర్ ప్రైజస్ నిర్మించనున్నాయి. అయితే ఇప్పుడు ఈ సినిమాలో ఎవరు హీరోగా నటిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. ఈ సినిమాలో అజిత్ డ్యూయల్ రోల్ లో నటించి ఆకట్టుకున్నారు. ఒక క్యారెక్టర్ లో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో అద్భుతంగా నటించి మెప్పించారు. ఇప్పుడు ఈ రీమేక్ లో ఓ కుర్రహీరో నటించనున్నాడని తెలుస్తుంది. త్వరలోనే ఆ వివరాలను వెల్లడించనున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Acharya: సిద్ద వచ్చేశాడు.. “ఆచార్య” పై అంచనాలను పెంచేసిన రామ్ చరణ్ టీజర్

Swara Bhaskar: అలా చేసినందుకు ఎండార్స్‌మెంట్‌ కాంట్రాక్టులన్నీ రద్దయ్యాయి.. బాలీవుడ్‌ నటి స్వరా భాస్కర్‌

D. Suresh Babu : అందుకే “దృశ్యం 2” సినిమాను థియేట్సర్స్‌కు ఇవ్వలేదు.. ఆసక్తికర విషయం చెప్పిన సురేష్ బాబు..

Loading...
Unable to load recommendations.
Follow Us