Arijit Singh: అర్జిత్ సింగ్ ఒక్కో సాంగ్‌కు ఎంత తీసుకుంటాడు? ఈ స్టార్ సింగర్ కు మొత్త ఎన్ని కోట్ల ఆస్తులున్నాయో తెలుసా?

బాలీవుడ్ ప్రముఖ గాయకుడు అరిజిత్ సింగ్ ప్లేబ్యాక్ సింగింగ్ కు రిటైర్మెంట్ ప్రకటించారు. వందలాది పాటలకు ప్రాణం పోసిన ఆయన సడెన్ గా తీసుకున్న ఈ నిర్ణయం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. మరి హిందీతో పాటు దక్షిణాది భాషల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న అర్జిత్ సింగ్ ఆస్తుల గురించి ఒకసారి తెలుసుకుందాం రండి

Arijit Singh: అర్జిత్ సింగ్ ఒక్కో సాంగ్‌కు ఎంత తీసుకుంటాడు? ఈ స్టార్ సింగర్ కు మొత్త ఎన్ని కోట్ల ఆస్తులున్నాయో తెలుసా?
Bollywood Singer Arijit Sin

Updated on: Jan 28, 2026 | 7:15 AM

బాలీవుడ్ స్టార్ సింగ్ అర్జిత్ సింగ్ ప్లేబ్యాక్ సింగింగ్ కు రిటైర్మెంట్ ప్రకటించడం లక్షలాది మంది సంగీత అభిమానులను బాధించింది. ఇండియన్ ఐడల్ ద్వారా తన కెరీర్‌ను ప్రారంభించిన ఈ స్టార్ సింగర్ కు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది అభిమానులు ఉన్నారు. గాయకుడిగా తన 15 ఏళ్ల కెరీర్‌లో ఎన్నో వందలాది పాటలకు ప్రాణం పోశాడు అర్జిత్ సింగ్. హిందీ, తెలుగతో పాటు బెంగాలీ, మరాఠీ తమిళం తదితర భాషల్లో సుమారు 400 కి పైగా పాటలకు ఆయన తన గాత్రాన్ని అందించారు. సినిమా పాటలతో పాటు లైవ్ షోలు, సింగింగ్ కన్సర్ట్ లకు హాజరవుతుంటాడు. ఈ క్రమంలో అర్జిత్ సింగ్ వార్షిక ఆదాయం సుమారు 70 కోట్లని తెలుస్తోంది. ఇందులో బ్రాండ్ ఎండార్స్‌మెంట్‌లు కూడా ఉన్నాయి. రెండు గంటల లైవ్ ప్రదర్శనకు 14 కోట్లు రుసుము వసూలు చేస్తాడట ఈ స్టార్ సింగర్.

ముంబైలోని వెర్సోవా ప్రాంతంలోని అర్జిత్ సింగ్ కు నాలుగు అపార్ట్‌మెంట్లు ఉన్నాయి. వీటిలో ఒక్కొక్కటి రూ.9 కోట్లకు పైగానే విలువ చేస్తుందని సమాచారం. రియల్ ఎస్టేట్ పెట్టుబడులతో పాటు, ఆయనకు రూ.1.8 నుండి 4 కోట్ల విలువైన రేంజ్ రోవర్ వోగ్, రూ.57 లక్షల నుండి 1.5 కోట్ల విలువైన హమ్మర్ H3, మెర్సిడెస్-బెంజ్ తదితర లగ్జరీ కార్లు కూడా ఉన్నాయి. మీడియా నివేదికల ప్రకారం, అర్జిత్ సింగ్ ఒక సినిమా కోసం పాట పాడటానికి రూ. 8 నుండి 10 లక్షలు తీసుకునేవాడు. ఒక్కోసారి ఇది రూ. 10 లక్షలకు పైగా ఉంటుంది. ఇలా తన సింగింగ్ ట్యాలెంట్ తో అర్జిత్ సింగ్ భారీగానే ఆస్తులు కూడబెట్టాడని తెలుస్తోంది.కొన్ని నివేదికల ప్రకారం ఈ స్టార్ సింగర్ నికర ఆస్తుల విలువ దాదాపు రూ.414 కోట్లుగా ఉందని తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.