
ప్రస్తుతం దేశవ్యాప్తంగా కేజీఎఫ్ 2 (KGF 2)మేనియా కొనసాగుతుంది. ఎక్కడ చూసిన కేజీఎఫ్ 2 హావా కనిపిస్తోంది. కన్నడ స్టార్ హీరో యశ్.. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబోలో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది. ఏప్రిల్ 14న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. విడుదలైన వారం రోజుల్లోనే దాదాపు రూ. 700 కోట్ల వసూళ్లు సాధించి రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది. యశ్ నటనపై.. ప్రశాంత్ నీల్ స్క్రీన్ ప్లే పై ప్రేక్షకులే కాదు.. సినీ విశ్లేషకులు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు. పాన్ ఇండియా లెవల్లో యశ్ క్రేజ్ మరోసారి పెరిగిపోయింది. ఈ క్రమంలోనే తాజాగా కేజీఎఫ్ 2 సినిమాపై ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ట్విట్టర్ వేదికగా ప్రశంసలు కురిపించారు. ఇంతటి భారీ విజయాన్ని అందుకున్న కేజీఎఫ్ 2 చిత్రయూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు బన్నీ..
” కేజీఎఫ్ 2 చిత్రయూనిట్‌కు అభినందనలు. యశ్ గారి నటన అద్భుతం. అమోఘం. సంజయ్ దత్, రవీనా టాండన్, శ్రీనిధి శెట్టి, ఇతర నటీనటులు అద్భుతంగా నటించారు. రవి బస్రూర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మరో లెవల్ తీసుకెళ్లింది.. భువనగౌడ్ ఎక్సలెంట్ విజువల్స్ అందించారు. సాంకేతిక నిపుణుల కృషికి నా గౌవరభినందనలు ” అంటూ ట్వీట్ చేశారు. అలాగే.. మరో ట్వీట్ లో “ప్రశాంత్ నీల్ గారి స్క్రీన్ ప్లే అద్భుతం. భారతీయ సినిమా ఖ్యాతిని పెంచినందుకు మీకు కృతజ్ఞతలు. ఈ సినిమా మంచి అనుభవాన్నించింది. ” అంటూ చిత్రయూనిట్ పై ప్రశంసలు కురిపించారు బన్నీ.
అయితే అల్లు అర్జున్ ట్వీట్‌కు రిప్లై ఇచ్చారు బాలీవుడ్ బ్యూటీ రవీనా టాండన్. ” థ్యాంక్యూ అల్లు అర్జున్. నేను మీకు పెద్ద అభిమానిని. మీ పుష్ప సినిమా చాలా నచ్చింది. మీకు మరిన్ని బ్లాక్ బస్టర్స్ రావాలి” అంటూ ట్వీట్ చేసింది.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Neha Shetty: మరో లక్కీ ఛాన్స్ కొట్టేసిన ‘డీజే టిల్లు’ రాధిక.. కార్తికేయ సరసన నేహా శెట్టి..
Vijay Devarakonda: విజయ్ దేవరకొండ ట్వీట్‌కు పగలబడి నవ్విన సమంత.. అసలేం జరిగిందంటే..