Asin: ఓనం వేడుకల్లో ఆసిన్ ఫ్యామిలీ.. కూతురును చూశారా ఎంత క్యూట్‌గా ఉందో! ఫొటోస్ వైరల్

కేరళంలో ఓనం పండగకు ఉన్న విశిష్టత గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సామాన్య జనాలతో పాటు సెలబ్రిటీలు కూడా ఎంతో ఘనంగా ఈ పండగను సెలబ్రేట్ చేసుకుంటారు. తాజాగా ఒకప్పటి హీరోయిన్ ఆసిన్ ఎంతో వేడుకగా ఓనం పండుగను జరుపుకొంది. అనంతరం ఇందుకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.

Asin: ఓనం వేడుకల్లో ఆసిన్ ఫ్యామిలీ.. కూతురును చూశారా ఎంత క్యూట్‌గా ఉందో! ఫొటోస్ వైరల్
Asin Family

Updated on: Aug 28, 2026 | 6:58 AM

ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగి ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న నటి అసిన్ తొట్టుంకల్ ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు. పెళ్లి తర్వాత నటనకు దూరంగా ఉంటోన్న తన ఫ్యామిలీని చూసుకోవడానికే ఎక్కువ సమయం కేటాయిస్తోంది. సోషల్ మీడియాలోనూ పెద్దగా యాక్టివ్ గా ఉండడం లేదు. దీంతో సినీ అభిమానులకు ఆసిన్ వ్యక్తిగత జీవితం గురించి పెద్దగా తెలియడం లేదు. అయితే, ఇప్పుడు ఓనం పండుగ సందర్భంగా అసిన్ తన ఫ్యామిలీకి సంబంధించిన కొన్ని అందమైన ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఈ ఫోటోలు నెటిజన్ల దృష్టిని ఆకర్షించాయి. ముఖ్యంగా ఇందులో ఆసిన్ కుమార్తె అరిన్ ఎంతో క్యూట్ గా కనిపించింది. దీంతో ఈ ఫొటోలు క్షణాల్లోనే వైరల్ గా మారాయి. ఈ ఫోటోలలో, అరిన్ సాంప్రదాయ పసుపు-నారింజ రంగు దుస్తులలో కనిపించింది. అలాగే ఓనమ్ కోసం బంతి పూలు, గులాబీ పూలను పేర్చుతూ కనిపించింది. ఈ ట్రెడిషినల్ అట్టైర్ లో ఆసిన్ కూతురు చాలా ముద్దుగా, క్యూట్ గా కనిపించింది.

సినిమాల పరంగా బిజీగా ఉంటోన్న సమయంలోనే అసిన్ 2016లో మైక్రోమాక్స్ సహ వ్యవస్థాపకుడు రాహుల్ శర్మను వివాహం చేసుకుంది. పెళ్లి తర్వాత, ఆమె క్రమంగా సినిమా ఇండస్ట్రీ నుంచి దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది. 2017లో అసిన్ ఒక కుమార్తెకు జన్మనిచ్చింది. 2015లో విడుదలైన ‘ఆల్ ఈజ్ వెల్’ అనే హిందీ చిత్రంలో అసిన్ చివరిసారిగా కనిపించింది. ఇందులో ఆమెతో పాటు అభిషేక్ బచ్చన్, రిషి కపూర్, సుప్రియా పాఠక్ ముఖ్య పాత్రలలో నటించారు. అంతకుముందు, అసిన్ ‘గజినీ’, ‘రెడీ’, ‘బోల్ బచ్చన్’ మరియు ‘హౌస్‌ఫుల్ 2’ తదితర సూపర్ హిట్ చిత్రాలతో ప్రేక్షకులను అలరించింది.

ఇవి కూడా చదవండి

ఓనం వేడుకల్లో ఆసిన్ కూతురు..

ఇక తెలుగు ఆడియెన్స్ కు కూడా ఆసిన్ బాగా పరిచయమే. ‘అమ్మానాన్న ఓ తమిళ అమ్మాయి’, ‘శివమణి’, ‘లక్ష్మీ నరసింహ’, ‘ఘర్షణ’, ‘చక్రం’, ‘అన్నవరం’, వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us