Aamir Khan: మూడో పెళ్లి చేసుకున్న ఆమిర్ ఖాన్.. ప్రియురాలితో రిజిస్టర్ మ్యారేజ్.. ఫొటోస్ వైరల్
బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ ముచ్చటగా మూడో పెళ్లి చేసుకున్నారు. 61 ఏళ్ల వయసులో గౌరీ స్ప్రాట్‌తో కలిసి వైవాహిక బంధంలోకి అడుగు పెట్టారు. ఆదివారం (జులై 05) ముంబైలో సింపుల్ గా జరిగిన వారి వివాహ వేడుకకు అంబానీ కుటుంబంతో పాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు.

బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్ మళ్లీ పెళ్లి చేసుకున్నారు. ఇప్పటికే రెండు సార్లు పెళ్లి చేసుకుని విడాకులు తీసుకున్న ఆయన ముచ్చటగా మూడోసారి వివాహం చేసుకున్నారు. తన ప్రియురాలు గౌరీ స్ప్రాట్‌తో కలిసి వైవాహిక బంధంలోకి అడుగు పెట్టారు. ముంబైలోని పాలి హిల్‌లో ఉన్న ఆమిర్ ఖాన్ నివాసంలో ఆదివారం (జూలై 5)న అత్యంత నిరాడంబరంగా ఈ పెళ్లి వేడుక జరిగింది. సరిగ్గా మధ్యాహ్నం 12.45 గంటలకు మ్యారేజ్ పేపర్స్ పై ఆమిర్ ఖాన్, గౌరీ సంతకాలు చేశారు. ఇరు కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు ఈ వివాహ వేడుకకు హాజరయ్యారు. కొత్త దంపతులకు అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు. మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) అధ్యక్షుడు రాజ్ థాకరే ఈ వివాహానికి హాజరై నూతన దంపతులకు విషెస్ చెప్పారు. కాగా కొన్ని రోజుల క్రితం తన పెళ్లి గురించి సమాచారం ఇస్తూ ఆమిర్ ఖాన్, తాను పెద్ద వేడుక లేకుండా ఇంట్లోనే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. దానికి అనుగుణంగా, పాలి హిల్‌లోని ఆయన నివాసాన్ని అందమైన దీపాలతో అలంకరించారు. అతిథులకు అవసరమైన ఏర్పాట్లను కూడా పూర్తి చేశారు.
ఆమిర్ ఖాన్ కుమార్తె ఐరా ఖాన్ తన భర్తతో పాటు ఈ వివాహ వేడుకకు హాజరయ్యారు. కుమారుడు జునైద్ ఖాన్ కూడా తన తండ్రి పెళ్లికి సాక్షి గా నిలిచారు. అలాగే ఆమిర్ ఖాన్ సోదరి, ఇతర సన్నిహిత బంధువులు కూడా ఈ వివాహ వేడుకకు హాజరయ్యారు. వివాహ వేడుకకు సుమారు 100 నుండి 150 మంది ఎంపిక చేసిన అతిథులను ఆహ్వానించారు. ఈ వేడుక చాలా పరిమితంగా జరిగినప్పటికీ, పలువురు ప్రముఖులు హాజరై నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు. ముంబైలో భారీ వర్షాలు, రెడ్ అలర్ట్ పరిస్థితి ఉన్నప్పటికీ పెళ్లి ఏర్పాట్లకు ఎలాంటి ఆటంకం కలగలేదు. పెళ్లికి ముందు రోజు సిబ్బంది ఫర్నిచర్, కుర్చీలను ఇంటి బయటకు తీసుకువస్తున్న ఫోటోలు కూడా వైరల్ అయ్యాయి. ప్రతికూల వాతావరణం ఉన్నప్పటికీ అనుకున్నట్లుగానే పెళ్లి సజావుగా జరిగింది.
గౌరీ స్ప్రట్‌తో ఆమిర్ ఖాన్‌కు ఇది మూడవ వివాహం. ఆయన గతంలో 1986లో రీనా దత్తాను వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు జునైద్, ఐరా అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే, సుమారు 16 సంవత్సరాల వివాహ బంధం తర్వాత, 2002లో వారిద్దరూ విడాకులు తీసుకున్నారు ఆ తర్వాత, ‘లగాన్’ సినిమా షూటింగ్ సమయంలో ఆమిర్, కిరణ్ రావును కలిశాడు. వారిద్దరూ 2005లో వివాహం చేసుకుని, ఆజాద్ అనే కుమారుడిని కన్నారు. అయితే, 2021లో ఆమిర్, కిరణ్ పరస్పర అంగీకారంతో విడిపోవాలని నిర్ణయించుకున్నారు.
ఆసక్తికరంగా, విడాకుల తర్వాత కూడా ఆమిర్ ఖాన్ తన ఇద్దరు మాజీ భార్యలైన రీనా దత్తా, కిరణ్ రావులతో స్నేహపూర్వక, గౌరవప్రదమైన సంబంధాలను కొనసాగిస్తున్నారు.
మ్యారేజ్ పేపర్లపై సంతకాలు చేస్తోన్న ఆమిర్ ఖాన్, గౌరీ స్ప్రాట్..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
