
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9లో వైల్డ్ కార్డ్ ఎంట్రీతో మంచి గుర్తింపు తెచ్చుకుంది దివ్వెల మాధురి. మాజీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ తో కలిసి ఉన్న ఆమె బిగ్‌బాస్ హౌస్‌లో కేవలం మూడు వారాలు మాత్రమే ఉంది. అయినా తన ఆట తీరు, మాటతీరుతో బిగ్ బాస్ ఆడియెన్స్ కు బాగానే చేరువైంది. మొదట్లో తన ‘ఫైర్ బ్రాండ్’ ట్యాగ్ కు తగ్గట్టుగానే తోటి కంటెస్టెంట్లతో దూకుడు స్వభావంతో వ్యవహరించిన ఆమె ఆ తర్వాత పూర్తిగా మారిపోయింది. మంచి గా మాట్లాడుతూ తోటి కంటెస్టెంట్లందరికీ దగ్గరైపోయింది. ముఖ్యంగా తనూజతో దివ్వెల మాధురికి మంచి అనుబంధం ఏర్పడింది. ఆ స్నేహంతోనే ఇటీవల తనూజ బర్త్ డేను గ్రాండ్ గా సెలబ్రేట్ చేసింది. అలాగే పుట్టిన రోజు కానుకగా ఒక నెక్లెస్ కూడా ఇచ్చింది. ఇదిలా ఉంటే తాజాగా జబర్దస్త్ వర్ష హోస్ట్ గా వ్యవహరిస్తోన్న ఓ టాక్ షో కు దివ్వెల మాధురి హాజరైంది. తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ నకు సంబంధించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. అలాగే తన జీవితంలో ఎదుర్కొన్న అవమానాలు, కష్టాలను షేర్ చేసుకుంది. వీటితో పాటు తన ఆస్తుల వివరాలపై కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.
‘‘మా ఆస్తుల వివరాలను చెప్పను కానీ, ప్రతి నెలా మేం మా వర్కర్స్‌కు రూ. 25 లక్షలు శాలరీ కింద ఇస్తాను. ఆస్తి ఎంత అంటే చెప్పలేను. కానీ దేవుడు ఇచ్చినంత అని మాత్రమే చెప్పగలను. నాకు గోల్డ్ అంటే ఇప్పటికీ చాలా ఇష్టం. మా ఆయన (దువ్వాడ శ్రీనివాస్) నాకు బంగారం కొనుక్కోమని.. రోజూ లక్ష రూపాయలు ఇస్తారు. నేను అది దాచిపెట్టి, ప్రతి నెలా రూ. 50 లక్షల బంగారం కొనుక్కుంటాను. నేను మొదటి నుంచి ఫైనాన్షియల్‌గా ఇండిపెండెంట్‌గానే ఉన్నాను. పెట్రోల్ బంక్స్ రన్ చేశాను, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశాను. ఆ తర్వాత పాలిటిక్స్‌లోకి వచ్చాను. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఈ డిస్టర్బెన్సెస్ అన్నీ క్రియేట్ అయ్యాయి. రాజకీయాల వల్ల మైనింగ్, పోర్ట్ బిల్లుల రూపంలో సుమారు రూ. 50 కోట్ల వరకు నష్టపోయాం’ అని మాధురి చెప్పుకొచ్చింది.
ఇక ఇటీవల తిరుమల ఇష్యూపై స్పందించిన దివ్వెల మాధురి.. ‘తనూజ బర్త్ డే ఆ రోజు. అందరినీ వదిలి వచ్చింది కదా అని, నేనే కేక్ తీసుకెళ్లి కట్ చేయించాను. కానీ దాన్ని కూడా పెద్ద ఇష్యూ చేసేశారు. చాలా మంది నేను క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. నేను మాత్రం ఎక్కడా క్షమాపణలు చెప్పలేదు ‘అని చెప్పుకొచ్చింది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.