బిగ్ బాస్ సీజన్ 7 చివరి దశకు వచ్చేసింది. మరికొన్ని వారాల్లో ఈ సీజన్ 7 కు ముగింపు పలకనున్నారు. ఈ క్రమంలో ఫైనలిస్ట్ అంటూ బిగ్ బాస్ హౌస్ లో ఉన్నవారికి ఒక టాస్క్ ఇచ్చాడు. రకరకాల గేమ్స్ ఇచ్చి ఒకొక్కరిని తొలగిస్తూ.. చివరికి ఒకరిని విన్నర్ ను చేశారు. మొదటి నుంచి ఫినాలే రేస్ ఆసక్తికరంగా సాగింది. అమర్ దీప్, అర్జున్ చివరివరకు పోటీపడ్డారు. కానీ చివరిలో అమర్ తడబడటంతో అర్జున్ ఫినాలే రేస్ లో విన్ అయ్యాడు. హౌస్ లో మొట్టమొదటి ఫైనలిస్ట్ గా నిలిచాడు అర్జున్. ప్రస్తుతం హౌస్ లో ఎనిమిది మంది ఉన్నారు. వీరిలో ఏడుగురు నామినేట్ అయ్యారు. అమర్ తప్ప మిగిలిన వారు.. అంటే శివాజీ, ప్రియాంక, శోభా శెట్టి, గౌతమ్, ప్రశాంత్, అర్జున్ , యావర్ నామినేషన్స్ లో ఉన్నారు. ఇప్పుడు అర్జున్ ఫైనలిస్ట్ కావడంతో ఎలిమినేషన్స్ నుంచి అర్జున్ తప్పించుకున్నాడు.
తాజాగా నేటి ఎపిసోడ్ కు సంబందించిన ప్రమోను రిలీజ్ చేశారు. ఈ ప్రోమోలో ఎప్పటిలానే నాగార్జున హౌస్ మేట్స్ కు క్లాస్ తీసుకున్నారు. ఈ రోజు శనివారం కావడంతో నాగార్జున హౌస్ లో ఉన్నవారి ఆట తీరు గురించి వివరించారు. తొలి రౌండ్స్ లోనే గేమ్ నుంచి ఎలిమినేట్ అయిన శోభను , శివాజీకి క్లాస్ తీసుకున్నారు నాగార్జున. శివాజీని ఎందుకని ఆడలేకపోయావ్ అని అడిగితే చేయి బాలేదు అని చెప్పాడు. ఒక గేమ్ కాలుతో కదా ఆడింది అని శివాజీ గాలి తీసేశారు నాగ్.
అలాగే శోభను 100 పర్సెంట్ ఇచ్చావా అని అడిగితే 200 పర్సెంట్ ఇచ్చాను అని చెప్పింది. కానీ 90పాయింట్స్ మాత్రమే వచ్చాయి అని పంచ్ వేశారు నాగ్. ఆతర్వాత మీ ఇద్దరు మీ పాయింట్స్ అమర్ కు ఎందుకు ఇచ్చారు అని అడిగారు నాగార్జున. దానికి శివాజీ నేను ముందు మాట ఇచ్చాను అని చెప్పాడు. శోభను అడిగి అమర్ అలుగుతాడని ఇచ్చావా అని అన్నారు., దానికి కాదు సార్ అని సామదానం ఇచ్చింది శోభా.. ఆ తర్వాత ప్రియాంకాను అడిగారు నాగార్జున. ముందు గౌతమ్ కి ఇచ్చి ఆతర్వాత గౌతమ్ ను ఎందుకు అమర్ కు ఇవ్వమన్నవ్ అని అడిగారు. దానికి ప్రియాంక ఎదో రీజన్ చెప్పింది. ఇదిలా ఉంటే ఇప్పుడు హౌస్ నుంచి ఎవరు ఎలిమినేట్ అవుతారు అన్నది ఆసక్తికరంగా మారింది. ఈ వారం హౌస్ నుంచి గౌతమ్ , శోభా ఈ ఇద్దరిలో ఒకరు ఎలిమినేట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. చూడాలి మరి ఎవరు ఎలిమినేట్ అవుతారో.. ఇక రెండో ప్రోమో కూడా రిలీజ్ అయ్యింది. దాని పైకూడా ఓ లుక్కేయండి..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.