Bigg Boss Telugu 10: బిగ్‌బాస్ 10లో రోహిత్ రీఎంట్రీ ఉంటుందా? నోట్ విడుదల చేసి మరీ క్లారిటీ ఇచ్చాడుగా

బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 హౌస్ లో ఉన్నన్నీ రోజులు టాప్ కంటెస్టెంట్ గా చెలామణి అయ్యాడు రోహిత్ నాయుడు. తన ఆట, మాట తీరుతో బిగ్ బాస్ ఆడియెన్స్ మనసులు గెల్చుకున్నాడు. అయితే కంటెస్టెంట్ల ఓటింగ్ తో అనూహ్యంగా ఎలిమినేట్ అయిపోయాడు.

Bigg Boss Telugu 10: బిగ్‌బాస్ 10లో రోహిత్ రీఎంట్రీ ఉంటుందా? నోట్ విడుదల చేసి మరీ క్లారిటీ ఇచ్చాడుగా
Bigg Boss Telugu 10

Updated on: Nov 16, 2026 | 7:23 PM

బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది.ఇప్పటికే ఈ రియాలిటీ షో విజయవంతంగా 10 వారాలు పూర్తి చేసుకుంది. ఇప్పుడు పదకొండో వారంలోకి కూడా అడుగుపెట్టింది. అయితే గత సీజన్లలో మాదిరిగానే ఇప్పుడు కూడా ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ బిగ్ బాస్ హౌస్ లోకి రీఎంట్రీ ఇచ్చారు. వారితోనే హౌస్ మేట్స్ ను నామినేట్ చేయించారు. అలా షాలినీ, అపూర్వ , ఝాన్సీ, మిథిలేష్, దక్షి తదితర ఎలిమినేటెడ్ కంటెస్టెంట్స్ 11వ వారంలో హౌస్ లోకి అడుగు పెట్టారు. వివిధ కారణాలు చెప్పి హౌస్ లో ఉన్నవారిని నామినేట్ చేశారు. ఔవీరి సంగతి పక్కన పెడితే.. రోహిత్ రీఎంట్రీ కోసం అతని అభిమానులు ఆశగా ఎదురు చూస్తున్నారు. ఎనిమిదో వారంలో ఎలిమినేట్ అయిన అతను కచ్చితంగా హౌస్ లోకి వస్తాడని గత రెండు వారాలుగా ప్రచారం జరుగుతోంది. దీపావళి వీక్ లోనే అతను హౌస్ లోకి వస్తాడని మొదట రూమర్స్ వినిపించాయి. అయితే అదేమీ జరగలేదు. ఇక ఫ్యామిలీ వీక్ కారణంగా రోహిత్ రీఎంట్రీ సాధ్యపడలేదు. అయితే 11 వ వారంలో రోహిత్ రీఎంట్రీ కచ్చితంగా ఉంటుందని చాలా మంది భావించారు. ముఖ్యంగా రోహిత్ ఫ్యాన్స్ అయితే అతని రీఎంట్రీ కోసం వేయికళ్లతో ఎదురు చూస్తున్నారు. అయితే తన రీఎంట్రీ విషయంపై స్వయంగా స్పందించాడు రోహిత్. ఈ మేరకు తాజాగా సోషల్ మీడియాలో ఒక కీలక నోట్ కూడా రిలీజ్ చేశాడు.

కాగా తాను ఎలిమినేట్ అయిన రోజుతోనే తన బిగ్‌బాస్ ప్రయాణం పూర్తిగా ముగిసిందని రోహిత్ స్పష్టం చేశాడు. ఇంకా క్లియర్ కట్ గా చెప్పాలంటే బిగ్ బాస్ హౌస్‌లోకి తన రీఎంట్రీ ఉండదని తేల్చిచెప్పాడు రోహిత్. ‘ నా విషయంలో మీరు చూపించిన ప్రేమ, ఆప్యాయత, మీ మద్దతు చూసి నాలో ఏదో ఒక మూలన రీ ఎంట్రీ ఇస్తాననే చిన్న ఆశ ఉండేది. కానీ, విధికి వేరే ప్రణాళికలు ఉన్నాయని నేను గట్టిగా నమ్ముతాను. బహుశా బిగ్‌బాస్ హౌస్‌లో నా ప్రయాణం ఎలిమినేట్ అయిన రోజుతోనే ముగిసి ఉండవచ్చు. కానీ ఎప్పటికీ ప్రేక్షకుల హృదయాలు గెలుచుకుంటూనే ఉంటాను. నా ఆట ముగిసి ఉండవచ్చు కానీ మన మధ్య ఉన్న ఈ బంధం శాశ్వతం. నాకు అన్ని విధాలా అండగా నిలిచి, ఈ ప్రయాణాన్ని ఎప్పటికీ మరపురానిదిగా చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు’ అని రాసుకొచ్చాడు రోహిత్. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. ముఖ్యంగా రోహిత్ రీఎంట్రీ ఉంటుందనుకున్న అభిమానులు ఈ నోట్ చేసి తీవ్ర నిరాశలో మునిగిపోయారు.

ఇవి కూడా చదవండి

ది ఎండ్.. రోహిత్ ఎమోషనల్ పోస్ట్..

.

బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 లేటెస్ట్ ప్రోమో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us