
రోహిత్ నాయుడు.. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ పేరు తెగ మార్మోగుతుంది. బిగ్ బాస్ తెలుగు సీజన్ 10లో తన దైన ఆట, మాటతీరుతో స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా పేరు తెచ్చుకున్న రోహిత్ అనూహ్యంగా ఎలిమినేట్ అయిపోయాడు. ఈ ఎలిమినేషన్ పై రోహిత్ అభిమానులతో పాటు సగటు బిగ్ బాస్ ఫ్యాన్స్ కూడా కొంతమంది తీవ్ర నిరాశకు లోనవుతున్నారు. రోహిత్ ఉంటేనే బిగ్ బాస్ షో ఇంట్రెస్ట్ గా ఉంటుందని, అతను లేకుంటే బోరింగ్ గా ఉంటుందని తమ అభిప్రాయాలను చెబుతున్నారు. అలాగే రోహిత్ ను వెంటనే తిరిగి బిగ్ బాస్ హౌస్ లోకి రప్పించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి సమయంలో తాజాగా రోహిత్ కి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది. 24 x7 స్ట్రీమింగ్ లో భాగంగా జియో హాట్ స్టార్ లో ప్రసారమవుతున్న బిగ్ బాస్ హౌస్ లోకి రోహిత్ కి కళ్ళకు గంతలు కట్టి మరీ తీసుకొచ్చినట్లు చూపించారు. రోహిత్ రీఎంట్రీ తో సుధీర్ తో పాటు హౌస్ లోని మిగతా కంటెస్టెంట్స్ కూడా షాక్ అయినట్లు మనం ఆ లీక్ అయిన వీడియోలో చూడవచ్చు. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం రోహిత్ కళ్లకు గంతలు కట్టుకున్న ఫొటో నెట్టింట వైరల్ గా మారింది.
సాధారణంగా ఏ కంటెస్టెంట్ ఎలిమినేట్ అయినా బిగ్ బాస్ హౌస్ లో అతని/ఆమె జర్నీని ఒక వీడియో రూపంలో చూపిస్తారు. కానీ రోహిత్ ఎలినేట్ అయినప్పుడు మాత్రం ఎలాంటి ఏవీ వేయలేదు. ఇప్పుడు రోహిత్ ఫ్యాన్స్ ఈ విషయాన్నే హైలెట్ చేస్తున్నారు. రోహిత్ రీఎంట్రీ ఇస్తాడని, అందుకే ఎలిమినేషన్ అయ్యాక అతని ఏవీ చూపించలేదని గట్టిగా చెబుతున్నారు. మొత్తానికి ఇప్పుడు సోషల్ మీడియా అంతా రోహిత్ రీఎంట్రీ గురించే చర్చ జరుగుతోంది.
కాగా ఎలిమినేషన్ తర్వాత ఇంటికి వెళ్లిన రోహిత్ తన ఇన్ స్టా గ్రామ్ లో ఒక ఆసక్తికర పోస్ట్ పెట్టాడు. తన మేనల్లుడిని చేతుల్లోకి తీసుకొని ఆప్యాయంగా మురిసిపోతున్న ఫోటోని షేర్ చేస్తూ ‘ చాలా రోజల తర్వాత నా మేనల్లుడితో’ అంటూ ఒక క్యాప్షన్ ఇచ్చాడు. దీంతో పాటు మరో పోస్ట్ కూడా పెట్టాడు రోహిత్. ముఖ్యంగా ఎలిమినేషన్ పై తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తూ ఒక ఆసక్తికర వీడియోను షేర్ చేశాడు. అందులో బిగ్ బాస్ హౌస్ లో తన ఎమోషనల్ మూమెంట్స్ ను షేర్ చేసుకున్నాడు. దీనికి ‘మూవీంగ్ ఆన్.. విత్ హెవీ హార్ట్’ అంటూ హార్ట్ బ్రేక్ సింబల్ చేశాడు. ప్రస్తుతం రోహిత్ పోస్టులు నెట్టింట వైరల్ గా మారాయి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి