Bigg Boss Telugu 10: బిగ్ బాస్ 10 ఐదో కంటెస్టెంట్ గా అమన్ మసూద్.. ఇతని బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా?

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10 ఐదో కంటెస్టెంట్‌గా అమన్ ఎంట్రీ ఇచ్చాడు. బిగ్ బాస్ అగ్ని పరీక్ష సీజన్ 2లో సత్తా చాటిన ఇతను ఇప్పుడు మెయిన్ కంటెస్టెంట్ గా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. మరీ అసలు ఎవరీ అమన్? అతని ట్యాలెంట్ ఏంటో తెలుసుకుందాం రండి.

Bigg Boss Telugu 10: బిగ్ బాస్ 10 ఐదో కంటెస్టెంట్ గా అమన్ మసూద్.. ఇతని బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా?
Bigg Boss Telugu 10

Updated on: Sep 06, 2026 | 8:57 PM

బిగ్‌బాస్‌ తెలుగు సీజన్ 10 గ్రాండ్ లాంఛ్ అట్టహాసంగా జరుగుతోంది. కింగ్ నాగార్జున తన దైన హోస్టింగ్ తో షోను రక్తి కట్టిస్తున్నాడు. ముఖ్యంగా మొదటి రోజే కంటెస్టెంట్లకు టాస్క్ లు ఇచ్చి వారిలోని ట్యాలెంట్ ను పరీక్షిస్తున్నాడు. అలాగే కంటెండర్స్ ఓపికను కూడా పరీక్షస్తున్నాడు. కాగా బిగ్ బాస్ తెలుగు సీజన్ 10లో మొదటి కంటెస్టెంట్ గా దేబ్ జానీ ఎంట్రీ ఇచ్చింది. హీరో త్రిగుణ్ రెండో కంటెండర గా హౌస్ లోకి అడుగు పెట్టాడు. ఇక అగ్ని పరీక్ష సీజన్ 2 నుంచి వచ్చిన కామనర్ సింగర్ ఝాన్సీ మూడో కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇవ్వగా, నాలుగో కంటెస్టెంట్ గా సుధీర్ వచ్చాడు. ఇక బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ సీజన్ 2లో ప్రేక్షకుల నుంచి అత్యధిక ఓట్లు సాధించిన అమన్‌ ఐదో కంటెస్టెంట్‌గా హౌస్‌లోకి అడుగు పెట్టాడు. షార్ట్ ఫిలిమ్స్, ప్రైవేట్ సాంగ్స్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు అమన్. ప్రస్తుతం సినిమాల్లోనూ నటుడిగా ట్రై చేస్తున్నాడు.

ఈ సందర్భంగా బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన అమన్ తన గురించి, తన బ్యాక్ గ్రౌండ్ గురించి పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చాడు. గేమ్‌పరంగా ఎంతో నిజాయతీగా ఉంటానని చెప్పాడు. ఈ సందర్భంగా అమన్‌కు నాగార్జున రెండు టాస్క్‌లు ఇచ్చారు. చిల్లులు పడిన టీషర్ట్‌ ఇచ్చి ‘ఎన్ని రంధ్రాలున్నాయో కనిపెట్ట’మని చెప్పారు. అలాగే రెడ్‌ డాట్ ఇచ్చి, ‘నీ తర్వాత వచ్చే ముగ్గురు కంటెస్టెంట్‌లలో ఒకరికైనా ఇది అంటించాలి. ఒకవేళ ఆ పని చేసింది నువ్వే అని తెలిసిపోతే నీకు వచ్చే ఓ అవకాశం చేజారిపోతుంది. వాళ్లు కనిపెట్టకలేకపోతే వాళ్ల కొక అవకాశం పోతుంది’ అని నాగార్జున టాస్క్‌ ఇచ్చి హౌస్ లోకి అమన్ నను పంపించాడు.

ఇవి కూడా చదవండి

 సినిమాల్లో ట్రై చేస్తోన్న అమన్ మసూద్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Loading...
Unable to load recommendations.
Follow Us