Ashu Reddy: చక్కనమ్మ చిక్కిన అందమే.. అషు రెడ్డి అందాలన్నీ ఆరబోసిందిగా..!

|

Mar 01, 2023 | 9:03 AM

కెరీర్ స్టార్టింగ్ లో పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో కనిపించింది ఈ బ్యూటీ. ఆ తర్వాత యాంకర్ గా పలు ఇంటర్వ్యూలు చేసింది.

Ashu Reddy: చక్కనమ్మ చిక్కిన అందమే..  అషు రెడ్డి అందాలన్నీ ఆరబోసిందిగా..!
Ashu Reddy
Follow us on

సోషల్ మీడియాలో సెగలు రేపుతోన్న బ్యూటీస్ లో అషురెడ్డి ఒకరు. ఈ భామ సినిమాల్లో కనిపించింది తక్కువే కానీ హీరోయిన్స్ ఉన్న క్రేజ్ ఉంది ఈ భామ. కెరీర్ స్టార్టింగ్ లో పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో కనిపించింది ఈ బ్యూటీ. ఆ తర్వాత యాంకర్ గా పలు ఇంటర్వ్యూలు చేసింది. ఇక బిగ్ బాస్ తెలుగు గేమ్ షోలో పాల్గొని మరింత పాపులారిటీ తెచ్చుకుంది ఈ చిన్నది. ముఖ్యంగా ఆర్జీవీతో బోల్డ్ గా ఇంటర్వ్యూ చేసి హాట్ టాపిక్ అయ్యింది ఈ హాట్ బ్యూటీ. అదే ఇంట్రవ్యూలో వర్మ అషు కాలికి ముద్దు పెట్టడం.. వేళ్ళు చప్పరించడం లాంటివి కూడా చేశారు. ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో మాత్రం ఓ రేంజ్ లో రెచ్చిపోతోంది అషు. హాట్ హాట్ ఫొటోలతో హీటు పుట్టిస్తోంది.

తాజాగా ఈ అమ్మడు అందాలు వడ్డిస్తూ షేర్ చేసిన ఫోటోలు కుర్రాళ్ల మతిపోగొడుతున్నాయి. దుబాయిలో ఉన్న అషు రెడ్డి  అక్కడి నుంచి ఫోటోలు షేర్ చేస్తోంది. లేటెస్ట్ గా ఈ అమ్మడు షేర్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

చక్కనమ్మ చిక్కినా అందమే అన్నట్టుగా సన్నగా మారిపోయిన అషు. గ్రీన్ కలర్ డ్రస్ లో కిర్రాక్ గా ఉంది. ఈ ఫోటోల పై అభిమానులు, నెటిజన్లు కొంటె కామెంట్స్ చేస్తున్నారు. అమ్మడి అందాలకు సముద్రాలూ కూడా ఆవిరిఅవుతాయి అంటున్నారు కుర్రకారు. అషు లేటెస్ట్ ఫోటోల పై మీరూ ఓ లుక్కేయండి.