Bhole Shavali: భోలే సార్.. ఏంటి ఇంత టాలెంట్.. నిజంగా హ్యాట్సాఫ్

|

Nov 09, 2023 | 12:53 PM

భోలే షావలి ప్రజంట్ జనాల ఫేవరెట్‌గా మారాడు. కేవలం అతడి ప్రవర్తన, టాలెంట్‌తో మాత్రమే పేరు తెచ్చుకుంటున్నాడు భోలే. కుట్రలు, కుతంత్రాలు లేవు. న్యాయం అనిపించింది చేస్తున్నాడు. మంచి అనిపించిన సైడ్ నిలబడుతున్నాడు. ఎవరైనా ఇబ్బంది పెట్టినా.. సర్దుకుపోతున్నాడు తప్పితే.. దాన్నే తిప్పి.. తిప్పి ఇష్యూగా మార్చడం లేదు. అందుకే అతనికి ఓట్లు వేస్తున్నారు జనాలు.

Bhole Shavali: భోలే సార్.. ఏంటి ఇంత టాలెంట్.. నిజంగా హ్యాట్సాఫ్
Seema - Bhole Shavali
Follow us on

భోలే షావలి సన్నాఫ్ యాకుబలి.. బిగ్ బాస్‌కు రాకముందు ఈయన గురించి ప్రజలకు అంతగా తెలీదు. వచ్చిన తర్వాత కూడా ఒకటి, రెండు వారాలు ఉండి వెళ్లిపోతాడు అని అనుకున్నాడు. కానీ భోలేకు కాలం కలిసివస్తుంది. దానికి అతడి టాలెంట్ కూడా తోడయ్యింది. టాస్కులు ఆడినా, ఆడకపోయినా.. తన ప్రవర్తన, అద్భతమైన సింగింగ్‌తో వీక్షకులను అలరిస్తున్నాడు. అప్పటికప్పుడే ట్యూన్ కడుతూ.. ఆ ట్యూన్‌కి తగ్గ లిరిక్స్ పాడుతూ అందరి మనసులు గెలుచుకుంటున్నారు. ఎదురుగా ఏం ఉంటే.. వాటి సాయంతో పాటకు తగ్గ మ్యూజిక్ కూడా క్రియేట్ చేస్తున్నాడు.  రెండవ వీక్ నామినేషన్స్ సందర్భంగా కాస్త తడబడ్డా.. ఇప్పుడు నిలబడి ముందుకు సాగుతున్నాడు. నిజంగా భోలే.. టాలెంట్ బండిల్‌లా అనిపించాడు. పల్లె పాటల్లో అతను తోపు అని ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. సరైన అవకాశాలు వస్తే.. ఇతగాడు చీల్చి చెండాడుతాడు అనిపిస్తుంది.

తాజాగా ఫ్యామిలీ ఎపిసోడ్‌లో భాగంగా భోలే షావలి కోసం తన భార్య సీమ ఎంట్రీ ఇచ్చారు. ఇక తన భార్యను చూసి భోలే ప్రేమగా గుండెలకు హత్తుకున్నాడు. ఇక ఇంట్లో అందరినీ భోలే ఆమెకు పరిచయం చేశాడు. గేమ్ చాలా బాగా ఆడుతున్నారని భార్య భోలేకు కితాబిచ్చింది. శరీరం సహకరించిన వరకు మాత్రమే ఆడమని సలహా ఇచ్చింది. ఫన్ ఇవ్వాలని.. పాటలు పాడాలని సూచించింది.  కొడుకు యాకూబ్‌ను తలుచుకుని కాస్త ఎమోషనల్ అయ్యాడు భోలే. భార్య కోసం ఓ మంచి సాంగ్ పాడి.. ఆమెను ఇంప్రెస్ చేశాడు ఈ మ్యూజిక్ కంపోజర్. కిచెన్ దగ్గరికి వెళ్లి అందరికీ ఆప్యాయంగా చపాతీలు తినిపించారు సీమ. అయితే సీమ ఇంటి నుంచి వెళ్లే సమయం వచ్చినప్పుడు వర్షం పడుతుంది. ఆ సందర్భంలో అప్పటికప్పుడు లిరిక్స్ కట్టి.. అద్భుతంగా ఓ పాటను క్రియేట్ చేశాడు భోలే. అతని టాలెంట్‌కు ఇంట్లో ఉన్నవాళ్లందరూ మెస్మరైజ్ అయ్యారు.

అంతేకాదు సీరియల్ బ్యాచ్ పదే, పదే.. భోలేను తప్పుపడుతూ ఉంటారు. గేలి చేయడం.. అతన్ని చిన్నచూపు చూడటం వంటివి చేస్తుంటారు. ప్రియాంక ప్రియుడు శివ్ ఇంట్లోకి వచ్చిన సమయంలో.. భోలే సార్ నేను మీకు పెద్ద ఫ్యాన్‌ని అనడంతో ప్రియాంక ప్యూజులు ఎగిరిపోయాయి. అంతేకాదు.. ఏకంగా భోలే కాళ్లకు నమస్కరించి.. హగ్ చేసుకున్నాడు శివ్. దీంతో హౌస్‌లో ఉన్నవాళ్లు ఆశ్చర్యపోగా.. ప్రియాంకకు తేరుకోడానికి చాలా సమయం పట్టింది.