
సోమవారం జరిగిన ఎపిసోడ్ లో నామినేషన్స్ ప్రక్రియ జరిగింది. ఈక్రమంలో ముందుగా యావర్ ప్రియాంకను తేజను నామినేషన్స్ లోకి పిలిచాడు. ప్రియాంకాను టార్గెట్ చేసి గతంలో ఆమె పవర్ అస్త్ర సమయంలో ఇద్దరు ఆడపిల్లలే అని నన్ను నామినేట్ చేసింది. అది నాకు నచ్చలేదు అందుకే తనను ఇప్పుడు నామినేట్ చేస్తున్నా అన్నాడు ప్రిన్స్. అలాగే తేజ ఫిజికల్ టాస్క్ ల్లో ఆడటం లేదు అని తెలిపాడు. వీరి మధ్య పెద్ద గొడవే జరిగింది. చివరకు ప్రియాంకాను నామినేట్ చేశారు. ఆతర్వాత శుభ శ్రీ అమర్ దీప్ ను రతికాను నామినేషన్స్ ఉంచింది. శుభ శ్రీ చెప్పిన దానికి రతికా రచ్చ రచ్చ చేసింది. ఇద్దరి మధ్య పెద్ద గొడవే జరిగింది. ఒకరినొకరు క్యారెక్టర్స్ వరకు వెళ్లి తిట్టుకున్నారు.
ఆతర్వాత గౌతమ్ ప్రిన్స్ ను, తేజను నామినేట్ చేయడంతో ప్రిన్స్, గౌతమ్ మధ్య పెద్ద గొడవే జరిగింది. ఒకరి మీదకు ఒకరు వెళ్ళారు. ప్రిన్స్ ఎప్పటిలానే తన కోపాన్ని చూపించాడు. గౌతమ్ కాస్త సహనంతోనే ఉన్నాడు. అయితే గౌతమ్ చెప్పిన రీజన్స్ సిల్లీగా అనిపించినా ప్రిన్స్ బిహేవియర్ కారణంగా అతడ్ని నామినేట్ చేశారు. కానీ బిగ్ బాస్ కేవలం రీజన్స్ మాత్రమే పరిగణలోకి తీసుకోవాలని అనడంతో అతడిని నామినేషన్ నుంచి తప్పించారు. తాజాగా నేటి ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమోను రిలీజ్ చేశారు. ఈ ప్రోమోలో గౌతమ్ జ్యురీ మెంబర్స్ పై సీరియస్ అవ్వడం చూపించారు. మీరు ఒకరివైపే మాట్లాడుతున్నారు అంటూ తన చేతిలో ఉన్న గొడుగును విసిరేయడం.. మైక్ తీసెయ్యడం చేశాడు. దాంతో శివాజీకి గౌతమ్ కు మధ్య గట్టిగానే వార్ జరిగిందని తెలుస్తోంది.
నువ్వెంత .? నువ్వెంత..? అంటూ శివాజీ మీదకు వెళ్ళాడు గౌతమ్. ఆ తర్వాత అమర్ గౌతమ్ తో మాట్లాడుతూ.. నువ్వు ట్రాక్ మారిపోతున్నావ్ .. పిచ్చా నీకు.. నీకు నువ్వే బాంబ్ పెట్టుకుంటున్నావ్ అని గౌతమ్ తో అన్నాడు. ఆతర్వాత అమర్ ప్రశాంత్ ను .. శుభ శ్రీ ని నామినేషన్స్ లో ఉంచాడు. ఆతర్వాత అమర్ తన రీజన్ చెప్తూ.. హౌస్ లో ఉన్నవారికి మాస్క్ చెరిగిపోతుంది అని అన్నారు. కానీ నువ్వు దాన్ని చాలా బాగా మెయింటేన్ చేస్తున్నావ్ అన్నాడు. రెండు మొఖాలొద్దు.. రెండు నాలుకలు వద్దు అని అన్నాడు అమర్. దానికి ప్రశాంత్ రెచ్చిపోయాడు. ఇది నా ఆట నేను ఇలానే ఆడతా.. నువ్వు కూడా రెండు మొఖాలతో ఆడుతున్నావ్ అని ప్రశాంత్ కూడా అనడంతో అమర్ కూడా రెచ్చిపోయాడు. దాంతో ఇద్దరి మధ్య గట్టిగానే గొడవ జరిగినట్టు చూపించారు. మరి ప్రోమోనే ఇలా ఉంటే ఈ రోజు ఎపిసోడ్ ఎలా ఉంటుందో చూడాలి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.