AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Prabhas: ప్రభాస్ మైనపు విగ్రహాన్ని తొలగించాలి.. లేకుంటే చర్యలు తీసుకుంటామన్న బాహుబలి నిర్మాత

దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటించిన ఈ సినిమాలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో రానా నటించాడు. ఈ సినిమా రెండు భాగాలుగా విడుదలైన సంచలన విజయం సాధించింది. ప్రభాస్ సరసన అనుష్క, తమన్నా హీరోయిన్స్ గా నటించారు. ఇక ఈ సినిమా అన్ని భాషల్లో సంచలన విజయం సాధించింది. అలాగే దాదాపు 1500 కోట్ల వరకు వసూల్ చేసింది. ప్రభాస్ అమరేంద్ర బాహుబలి. మహేంద్ర బాహుబలి అనే రెండు పాత్రల్లో నటించి మెప్పించారు. ప్రభాస్ అమరేంద్ర బహుబాలి పాత్రలో ఉన్న మైనపు విగ్రహాన్ని లండన్ లోని మేడమ్‌ టుస్సాడ్స్‌లో ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.

Prabhas: ప్రభాస్ మైనపు విగ్రహాన్ని తొలగించాలి.. లేకుంటే చర్యలు తీసుకుంటామన్న బాహుబలి నిర్మాత
Prabhas
Rajeev Rayala
|

Updated on: Sep 26, 2023 | 11:25 AM

Share

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన బాహుబలి సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటించిన ఈ సినిమాలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో రానా నటించాడు. ఈ సినిమా రెండు భాగాలుగా విడుదలైన సంచలన విజయం సాధించింది. ప్రభాస్ సరసన అనుష్క, తమన్నా హీరోయిన్స్ గా నటించారు. ఇక ఈ సినిమా అన్ని భాషల్లో సంచలన విజయం సాధించింది. అలాగే దాదాపు 1500 కోట్ల వరకు వసూల్ చేసింది. ప్రభాస్ అమరేంద్ర బాహుబలి. మహేంద్ర బాహుబలి అనే రెండు పాత్రల్లో నటించి మెప్పించారు. ప్రభాస్ అమరేంద్ర బహుబాలి పాత్రలో ఉన్న మైనపు విగ్రహాన్ని లండన్ లోని మేడమ్‌ టుస్సాడ్స్‌లో ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. జీవకళ ఉట్టిపడేలా ఆ విగ్రహాన్ని తాయారు చేశారు. అలాగే ఇప్పుడు మరో చోట కూడా ప్రభాస్ మైనపు విగ్రహాన్ని తయారు చేశారు.

మైసూర్‌లోని ఓ మ్యూజియంలోనూ ప్రభాస్ మైనపు విగ్రహాన్ని తాయారు చేశారు. సేమ్ మేడమ్‌ టుస్సాడ్స్‌లో ఎలాంటి విగ్రహం ఉందో అలాంటి విగ్రహాన్నే మైసూర్ లోనూ తాయారు చేశారు. దీని పై చిత్ర నిర్మాత శోభూ యార్లగడ్డ సోషల్ మీడియా ద్వారా స్పందించారు. ఈ విగ్రహానికి అనుమతి లేదని.. తమ అనుమతితో ఈ విగ్రహం ఏర్పాటు చేయలేదు అని అన్నారు.  ఇందుకు సంబంధించిన ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

శోభు యార్లగడ్డ ట్విటర్‌ వేదికగా స్పందిస్తూ…’ ఇది అనుమతి తీసుకుని చేసిన పని కాదు. మాకు తెలియకుండా, మా దృష్టికి తీసుకురాకుండా విగ్రహాన్ని తాయారు చేశారు. అంతే కాకుండా దాన్ని మ్యూజియంలో పెట్టారు. వెంటనే విగ్రహాన్ని తొలగించేలా తగిన చర్యలు తీసుకుంటాం’ అని అన్నారు శోభు యార్లగడ్డ. ఇక ప్రభాస్ సినిమాల విషయానికొస్తే.. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా క్రిస్మస్ కు రిలీజ్ అయ్యే ఛాన్స్ లు ఉన్నాయి. అలాగే నాగ్ అశ్విన్ తో కల్కీ, మారుతి దర్శకత్వంలో ఒకటి, సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్ లో స్పిరిట్ లాంటి సినిమాలు చేస్తున్నాడు

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ఈ ఆకు సర్వరోగ నివారిణి.. ఉదయాన్నే ఇలా తిన్నారంటే.. బ్లడ్ షుగర్‌
ఈ ఆకు సర్వరోగ నివారిణి.. ఉదయాన్నే ఇలా తిన్నారంటే.. బ్లడ్ షుగర్‌
ఏఐ ప్లస్ నోవా 2 పవర్ 5జీలో స్పెషల్ ఫీచర్లు ఇవే
ఏఐ ప్లస్ నోవా 2 పవర్ 5జీలో స్పెషల్ ఫీచర్లు ఇవే
ఈ చిత్రంలో ఉన్న 8 మందిని, ఓ పిల్లిని గుర్తిస్తే.. మీరే తోపులు!
ఈ చిత్రంలో ఉన్న 8 మందిని, ఓ పిల్లిని గుర్తిస్తే.. మీరే తోపులు!
ఈ రాశుల వారికి ఆకస్మిక ధనలాభం.. బుధవారం దినఫలాలు ఎలా ఉన్నాయంటే..
ఈ రాశుల వారికి ఆకస్మిక ధనలాభం.. బుధవారం దినఫలాలు ఎలా ఉన్నాయంటే..
హారిజాంటల్ కెమెరాతో త్వరలో మార్కెట్‌లోకి షియోమీ 18 ఫోల్డ్‌
హారిజాంటల్ కెమెరాతో త్వరలో మార్కెట్‌లోకి షియోమీ 18 ఫోల్డ్‌
OTTలో మాధవన్ లేటెస్ట్ మూవీ.. నిజ జీవిత సంఘటనలతో తెరకెక్కిన సినిమా
OTTలో మాధవన్ లేటెస్ట్ మూవీ.. నిజ జీవిత సంఘటనలతో తెరకెక్కిన సినిమా
రికార్డ్‌ స్థాయిలో కుప్పకూలుతున్న బంగారం ధరలు..భారీ తగ్గింపు
రికార్డ్‌ స్థాయిలో కుప్పకూలుతున్న బంగారం ధరలు..భారీ తగ్గింపు
ఫిట్‌బిట్ ఎయిర్ పోకీమాన్ స్లీప్ ఎడిషన్.. వివరాలివే
ఫిట్‌బిట్ ఎయిర్ పోకీమాన్ స్లీప్ ఎడిషన్.. వివరాలివే
టాప్ టెన్‌లో యాపిల్, శాంసంగ్ హవా.. కొత్తవి ఎన్నొచ్చినా
టాప్ టెన్‌లో యాపిల్, శాంసంగ్ హవా.. కొత్తవి ఎన్నొచ్చినా
ఎందుకు తొక్కేస్తున్నారు? మొన్న రెస్ట్ అన్నారు.. మరి ఇప్పుడేమైంది?
ఎందుకు తొక్కేస్తున్నారు? మొన్న రెస్ట్ అన్నారు.. మరి ఇప్పుడేమైంది?