
పునర్నవి భూపాలం.. తెలుగు సినీప్రియులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు. రాజ్ తరుణ్, అవికా గోర్ జంటగా నటించిన ఉయ్యాల జంపాల సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఇందులో హీరోయిన్ స్నేహితురాలిగా కనిపించింది. ఆ తర్వాత తెలుగులో ఒకటి రెండు చిత్రాల్లో చిన్న చిన్న పాత్రలు పోషించింది.కానీ బిగ్ బాస్ రియాల్టీ షో ద్వారా ఎక్కువగా పాపులర్ అయ్యింది. బిగ్‌బాస్ తెలుగు 3వ సీజన్ లో పాల్గొంది మరింత ఫేమస్ అయ్యింది. ముఖ్యంగా ఈ సీజన్ లో ఆమె పేరు చెప్పగానే రాహుల్ సిప్లిగంజ్ తో నడిన ఆన్ స్క్రీన్ లవ్ స్టోరీ గుర్తుకువస్తుంది.
ఇవి కూడా చదవండి : Bigg Boss 9 Telugu : అబ్బ సాయిరాం.. ఒక్క మాటతో టాప్ 5కు.. ఓటింగ్లో దుమ్ములేపుతున్న డేంజర్ జోన్ కంటెస్టెంట్.. ఎలిమినేట్ అయ్యేది..
అప్పట్లో రాహుల్, పునర్నవి పేరు మారుమోగింది. వీరిద్దరి జోడికి మంచి ఫ్యాన్ బేస్ ఉండేది. షో నుంచి బయటకు వచ్చిన తర్వాత వీరిద్దరి మళ్లీ అంతగా కనిపించలేదు. ఇటీవలే రాహుల్ సిప్లిగంజ్.. హరిణ్య అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. ఈ క్రమంలో తాజాగా పునర్నవి సైతం తన ప్రియుడిని పరిచయం చేసింది. త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్లు హింట్ ఇచ్చేసింది.
ఇవి కూడా చదవండి : Shhyamali De: నిద్రలేని రాత్రులు గడుపుతున్నా.. నా బాధను అర్థం చేసుకోండి.. రాజ్ నిడుమోరు మాజీ భార్య పోస్ట్..
కశ్మీర్ లో తన ప్రియుడు ప్రపోజ్ చేయడంతో యస్ చెప్పినట్లు నెట్టింట పోస్ట్ చేసింది. అతడి పేరు హేమంత్ వర్మ. ఫోటోగ్రాఫర్ అన్నట్లు తెలుస్తోంది. పునర్నవి భూపాలం.. కొన్నాళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటుంది.కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది.
ఇవి కూడా చదవండి : Actress : ఆ పని నేను చేయలేదు.. అందుకే నాకు ఆఫర్స్ రావడం లేదు.. హీరోయిన్ స్నేహా ఉల్లాల్..