బొండు మల్లెలా బొద్దుగా ఉండేది.. ఇప్పుడు హాట్‌నెస్‌కు కేరాఫ్ అడ్రస్.. పిచ్చెక్కిస్తున్న బ్యూటీ

ఈ అందాల భామ చేసినవి 24 సినిమాలు.. 2007లో సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది.. అయితే ఇప్పటివరకు సరైన బ్రేక్ సాధించలేకపోయింది. కానీ ఇప్పుడేమో సోషల్ మీడియాలో తెగ ట్రెండింగ్ అవుతోంది. మన తెలుగులో ఒక్క సినిమా చేసిన ఈ అమ్మడు ఎవరో తెలుసా.?

బొండు మల్లెలా బొద్దుగా ఉండేది.. ఇప్పుడు హాట్‌నెస్‌కు కేరాఫ్ అడ్రస్.. పిచ్చెక్కిస్తున్న బ్యూటీ
Actress

Updated on: Apr 07, 2026 | 6:38 PM

చాలా మంది హీరోయిన్స్ అప్పటికీ ఇప్పటికీ చాలా మారిపోతుంటారు. కొంతమందిని గుర్తుపట్టడం కూడా కష్టం అయిపోతుంది. మొదటి సినిమాతో పోల్చుకుంటే ఇప్పుడు చాలా మంది హీరోయిన్స్ మరింత అందంగా, మరింత గ్లామరస్ గా మారి ప్రేక్షకులను కవ్విస్తున్నారు. వారిలానే ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే అమ్మడు కూడా.. ఈ ముద్దుగుమ్మ కెరీర్ బిగినింగ్ లో బొద్దుగా భలే ఉండేది. ఇప్పుడు సన్నజాజిలా మారిపోయి అందరిని అవాక్ అయ్యేలా చేస్తుంది. అంతే కాదు హాట్ హాట్ ఫొటోలతో కుర్రాళ్ల మతిపోగొడుతోంది. ఈ బ్యూటీ తెలుగులో ఒకే ఒక్క సినిమా చేసింది. ఆ సినిమా పర్లేదు అనిపించుకుంది. కానీ ఆసినిమాలో నటించిన ఈ భామ మాత్రం అందరి దృష్టి ఆకర్షించింది. ఆమె ఎవరంటే..

ఇక సుదీర్ బాబు నటించిన సినిమాల్లో భలేమంచి రోజు అనే సినిమా ఒకటి. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా 2015లో విడుదలైంది. ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది. కానీ భారీ హిట్ మాత్రం అందుకోలేకపోయింది. ఈ మూవీలో సుధీర్ బాబు తన నటనతో ఆకట్టుకున్నాడు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన బ్యూటీ గుర్తుందా.? ఆమె ఇప్పుడు ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్.. అప్పటికీ ఇప్పటికీ చాలా మారిపోయింది. ఆమె మరెవరో కాదు పేరు వామికా గబ్బి.. ఇప్పుడు ఆమె చాలా క్రేజ్ ఉన్న హాట్ బ్యూటీ. అవును వామికను ఇప్పుడు చూస్తే ఫ్యూజులు ఎగిరిపోవాల్సిందే..

ఇవి కూడా చదవండి

భలేమంచి రోజు సినిమా సమయంలో ఆమె కాస్త బొద్దుగా కనిపించింది ఈ చిన్నది. కానీ ఇప్పుడు జీరోసైజ్ లోకి మారి అందరిని అవాక్ అయ్యేలా చేస్తుంది. అంతే కాదు తన అందాలతో కుర్రకారుకు కిర్రెక్కిస్తుంది ఈ అమ్మడు. ఈ ముద్దుగుమ్మ పంజాబీ, హిందీ సినిమాలతో పాటు తెలుగు, మలయాళ సినిమాల్లోనూ నటించింది. మొన్నామధ్య వరుణ్ ధావన్ ,కీర్తిసురేష్ జంటగా నటించిన బేబీ జాన్ సినిమాలో నటించింది. ఇక ఇప్పుడు అక్షయ్ కుమార్ నటిస్తున్న భూత్ బంగ్లా సినిమాలో నటిస్తుంది. సోషల్ మీడియాలో ఈ బ్యూటీ షేర్ చేసే హాట్ ఫోటోలకు కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us